జాతీయ వార్తలు

మరింత మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం గత 48 గంటల్లో చాలావరకు మెరుగుపడిందని ఏఐఐఎంఎస్ డాక్టర్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈనెల 11న వాజ్‌పేయి (93) ఏఐఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయన ఉదరం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని ఏఐఐఎంఎస్ డైరెక్టర్ నణదీప్ గులెరియా తెలిపారు. ప్రస్తుతం ఆయన కిడ్నీల పనితీరు మెరుగైందని, ఆయన ఆరోగ్యంలో మెరుగుదల
కనిపిస్తోందని గులెరియా పేర్కొన్నారు. ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారని ఏఐఐఎంస్ పేర్కొంది. 2009లో వాజ్‌పేయి గుండె పోటుకు గురయ్యారు. ఆ తర్వాత మతిమరుపు వ్యాధికి గురయ్యారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు కేవలం ఒకే కిడ్నీ పనిచేస్తున్నది. ఇప్పటి వరకు 1999-2004 మధ్యకాలంలో పూర్తికాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయి చరిత్ర సృష్టించారు. తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రజాజీవితం నుంచి క్రమంగా తప్పుకున్నారు. కొద్ది సంవత్సరాలుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు.