జాతీయ వార్తలు

‘హెచ్‌ఎంటీ’ సృష్టికర్తకూ గుర్తింపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: నేడు ఎంతో ప్రాచుర్యం పొందిన ‘హెచ్‌ఎంటి’ వరి వంగడం సృష్టికర్త, ఒక నిరుపేద దళిత రైతు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. దాదాజీ ఖోబ్రాగాడే ఆయన పేరు. మొత్తం 11 వరివంగడాలను కనిపెట్టిన నిరుపేద శాస్తవ్రేత్త! దేశానికి అధిక దిగుబడినిచ్చే వరివంగడాలను సృష్టించి తాను మాత్రం దుర్భర పేదరికంలోనే 78వ ఏట ఈ నెల మొదట్లో మరణించాడు. అంతటి గొప్ప మనిషిని ఇప్పటివరకు పట్టించుకున్నవారు లేరు. కనీసం ఆయన సృష్టించిన వరి వంగడాలకు పేటెంట్ హక్కులు కూడా లేవు. మహారాష్ట్ర, గడ్చీరోలీ జిల్లా చంద్రాపూర్ దగ్గర నాందేడ్ ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఖోబ్రాగాడే గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. దాదాపు ఇరవై నిముషాల సేపు ఆయన ఖోబ్రాగాడే కుటుంబ సభ్యులతో ఏకాంతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయా వెరైటీలకు పేటెంట్ హక్కుల గురించి కూడా చర్చ జరిగిందని కాంగ్రెస్ నేత అశోక్ చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఖోబ్రాగాడె కనిపెట్టిన వరివంగడాలకు పేటెంట్ హక్కుల విషయా న్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెల్హా ట్, మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ చీఫ్ అశోక్ చవాన్, రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణ విఖే-పాటిల్ కూడా ఉన్నారు. కాగా దీనిపై రాహుల్ ‘దాదాజీ ఖోబ్రాగాడే దళిత రైతు-శాస్తవ్రేత్త. ఆయన విప్లవాత్మక హెచ్‌ఎంటి రకం వరిని కనుగొన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి పట్ల దేశం ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల క్షమాపణ కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఖోబ్రాగాడే కుటుంబ సభ్యులతో ముచ్చటించిన తర్వాత రాహుల్ గాంధీ నాందేడ్ గ్రామస్తులతో ‘చౌపల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై వివిధ అంశాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.