జాతీయ వార్తలు

లోక్‌పాల్ ఏర్పాటు చేసేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: దేశంలో లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో తమకు పది రోజుల్లో తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రంజన్ గాగోయ్, ఆర్.్భనుమతితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది 27నే ఆదేశించినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ కామన్ కాజ్ అనే ఎన్జీవో సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు దీనిపై పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని తదుపరి విచారణను జూలై 17న చేపడతామని పేర్కొంది. ఎన్జీవో సంస్థ తరపున శాంతిభూషణ్ వాదించగా, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.వేణుగోపాల్ హాజరయ్యారు. అంతకుముందు లోక్‌పాల్ ఎన్నిక కమిటీ త్వరలోనే సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుందని అటార్నీ జనరల్ తెలియజేయగా, సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి సంవత్సరమైనా లోక్‌పాల్ ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని శాంతిభూషణ్ పేర్కొన్నారు. ఒకవేళ లోక్‌పాల్‌ను కేంద్రం ఏర్పాటు చేయకపోతే 142 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు తన విచక్షణాధిరాన్ని ఉపయోగించి లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.