జాతీయ వార్తలు

వ్యవ‘సాయం’తోనే చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: అస్థిర వాతావరణ పరిస్థితుల నుంచి భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే వ్యవసాయ యోగ్యమైన భూమి పరిమాణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం సూచించారు. వ్యవసాయ రంగంలో ఎంతగా భూ పరిమాణాన్ని పెంచగలిగితే అంతగానూ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన పునర్వినియోగ ఇంధన పథకం ద్వారా స్పష్టం చేశారని, ఆయన ఆలోచన పట్ల సర్వత్రా సానుకూలత కనిపించిందని సుబ్రమణ్యం తెలిపారు. దక్షిణాసియా హాట్‌స్పాట్స్ అన్న అంశంపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన సోమవారంనాడిక్కడ మాట్లాడారు. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలకు భారత ప్రభుత్వం విశేషమైన ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొన్న ఆయన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి అవసరాలను, లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ప్రస్తుతం భారత దేశంలో సేద్య రంగంలో ఉన్న భూమి 50శాతం కంటే తక్కువేనని పేర్కొన్న ఆయన వ్యవసాయ పరిధిలో ఉన్న భూమిపై కంటే కూడా దీనికి ఆవల ఉన్న భూమిపైనే ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నారు.
వాతావరణ మార్పుల వల్ల భారత్ తీవ్రంగా నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తిలో 2.8శాతం మేర భారత్ నష్టపోతుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది.
అలాగే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోని పక్షంలో 2050నాటికి సగానికిపైగా దేశ జనాభా జీవన ప్రమాణం కూడా దీని వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించింది.రానున్న మూడు దశాబ్దాల కాలంలో సగటు ఉష్ణోగ్రత1-2శాతం మేర పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేసింది. ముఖ్యంగా భారత్‌లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని, ఇప్పటి నుంచే నిరోధక చర్యల దిశగా చర్యలు చేపట్టకపోతే ఈ ఉష్ణోగ్రత తీవ్రత 1-5 నుంచి 3శాతం వరకూ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.
ప్యారిస్ పర్యావరణ శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ భారత దేశంలో వార్షిక ఉష్ణోగ్రత సగటున 2050నాటికి 1-2శాతం మేర పెరగడం తథ్యమని వెల్లడించింది.