జాతీయ వార్తలు

జూన్‌లో నిలకడగా వినియోగదారుల కొనుగోలు శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: జూన్‌లో వినియోగదారుల కొనుగోలు శక్తి, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల ప్రవృత్తి నిలకడగానే ఉందని ద జినిసిస్ ఇండియా కన్స్యూమర్ సెంటిమెంట్ (జిఐసిఐ) ప్రకటించింది. వినియోగదారుల కొనుగోలు శక్తి, వారు జరిపే ఆర్థిక వ్యవహారాల స్థాయిని లెక్కకెట్టి వెల్లడించే జిఐసిఐ జూన్‌లో ప్రజల కొనుగోలు శక్తి నిలకడగానే ఉందని చెప్పింది. మేలో ఇది 60.45 శాతం ఉండగా, జూన్‌లో 60.00 ఉండి నిలకడగా నిలిచినట్టు పేర్కొంది. ఆర్‌బిఐ రేట్ల ప్రభావంతో తమకు లాభం కలుగుతుందని వినియోగదారులు పేర్కొన్నా దాని ప్రభావం మాత్రం కన్పించలేదు. వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించిన అనంతరం 50.00 పాయింట్లకు మించి వస్తే అది వినియోగదారుల ఆశావాదాన్ని సూచిస్తుందని, 50.00 పాయింట్లకు మించి చూపిస్తే పూర్తి నిరాశావాదాన్ని ప్రతిబింబిస్తుందని జిఐసిఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ తన కీ రేట్‌ను 0.25 నుంచి 6.26 శాతానికి పెంచిన నేపథ్యంలో వినియోగదారుల నమ్మకం స్థిరంగా పెరుగుతూ వచ్చింది.