జాతీయ వార్తలు

అమర్‌నాథ్ యాత్రికులకు ఉగ్ర దాడి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: అమరనాథ్ యాత్ర చేస్తున్న భక్తులపై ఉగ్రదాడి పొంచి ఉంది. లష్కర్-ఇ-తొయిబాసంస్థ ఆధ్వర్యంలో ఈ దాడి కుల్గాంలోని వీసుమీర్ బజార్‌లో జరపడానికి కుట్ర జరిగింది. దీనికి మహ్మద్ నవీద్ జుత్ అలియాస్ ఆబు హంజలా నేత్వత్వం వహించవచ్చునని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎల్‌ఇటి పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను కాశ్మీర్ లోయలోకి రప్పించుకునేందుకు గతంలో ప్రయత్నించింది. ఫిబ్రవరిలో ఈ ప్రయత్నంలో ఉన్న ఉగ్రవాదులపై మన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో నవీద్ జత్ అనే ఉగ్రవాది పరారయ్యాడు. లష్కరే ఉగ్రవాదులు పెద్దయెత్తున ఆయుధాలను రప్పించి అమర్‌నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడవచ్చునని నిఘావర్గాలకు సమాచారం రావడంతో వారు భద్రతాదళాలు, పోలీసులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్రను పురస్కరించి ప్రభుత్వ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. అత్యున్నత శిక్షణ పొందిన ఎన్‌ఎస్‌జి కమాండెంట్ల టీమ్‌ను అమర్‌నాథ్‌కు పంపింది. అలాగే 12 మంది ఎన్‌ఎస్‌జి స్నిప్పర్లను ఇతర కమాండెండ్లను వివిధ ప్రదేశాల్లో మోహరించింది. సిఆర్‌ఎఫ్ కూడా ప్రత్యేక మోటార్‌సైకిళ్ల దళాన్ని ఏర్పాటు చేసింది. వీరు యాత్రికుల భద్రతను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా అంబులెన్స్ టీమ్‌గా కూడా వ్యవహరిస్తారు. అమర్‌నాథ్ యాత్రికులను తీసుకుని వెళ్తున్న ప్రతి వాహనాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తోంది. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం వాహనాలను పర్యవేక్షిస్తున్నారు. ఇలావుండగా అంతర్జాతీయ నియంత్రణ లేక సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు ఉగ్రవాదులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని హోంశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.