జాతీయ వార్తలు

గోపరిరక్షణ దళాల ఆగడాలూ నేరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూలై 3: గోపరిరక్షణ పేరిట ఏర్పాటైన దళాలు మనుషులను చంపే సంస్కృతిని శాంతిభద్రతల సమస్యగా చూడరాదని, ఇది ముమ్మాటికి నేరమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరించేవారిని ఉపేక్షించరాదని, చట్ట అతిక్రమణకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును రిజర్వుచేసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించే ముందు పై వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖాన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన మహాత్మాగాంధీ మునిమనవరాలు తుషార్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ, గో పరిరక్షణ దళాల ఆగడాలకు ముకుతాడు వేసేందుకు కోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, గోహత్యకు పాల్పడ్డారనే అనుమానంతో కొంత మందిని చంపుతున్నారని తెలిపారు. ఢిల్లీకి 60 కి.మీ దూరంలో కూడా ఈ ఘటనలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చట్టాలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. ఈ ఘటనలు తలెత్తకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. వీటిని శాంతి భద్రతల కోణంలోచూడరాదని, ముమ్మాటికీ నేరమని కోర్టు పేర్కొంది. రాష్ట్రాలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. సామూహికంగా దాడి చేసి హింసకు పాల్పడడం నేరమని కోర్టు తెలిపింది. కొన్ని కేసుల్లో రాష్ట్రాలను నియంత్రించేందుకు 257వ అధికరణ ఉందని, దీని కింద పైన పేర్కొన్న తరహా ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహ మాట్లాడుతూ కోర్టు ప్రస్తావించిన అమానవీయ ఘటనలను కేంద్రం ఉపేక్షించదన్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రప్రభుత్వాలు పాటించే టట్లు వత్తిడి తెస్తామన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ ఈ నెపాన్ని రాష్ట్రప్రభుత్వాలపై నెట్టి తప్పించుకుందామని కేంద్రం చూస్తోందన్నారు. కాగా ఈ కేసులో కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్టే వాదనలు వినిపించారు. కాగా గోపరిరక్షకుల ఆగడాలను నిరోధించేందుకు తాము నిర్దేశించిన ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను వివరించాలని గతంలోనే కోర్టు రాజస్తాన్, మధ్యప్రదేశ్, హర్యానా,యుపీ రాష్ట్రాలను కోరింది. కోర్టు ధిక్కరణ కింద తుషార గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన పై పిటిషన్‌ను దాఖలు చేశారు.