జాతీయ వార్తలు

నా శాఖల్లో కోటి మందికి ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన శాఖలో కోటి మందికి ఉద్యోగాలు వచ్చాయని రోడ్డు రవాణా, హైవేలు, నౌక, జలవనరులు, నదుల అభివృద్ధి మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉపాధి కల్పనపై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలను మంగళవారం ఆయన కొట్టిపారేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాకే లక్షల ఉద్యోగాలు కల్పించి విషయం నూటికి నూరుపాళ్లు నిజమని గడ్కరీ స్పష్టం చేశారు. ‘ప్రధాన మంత్రి చెప్పిందే నిజం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మోదీ ప్రభుత్వం ప్రగతి పథాన దూసుకుపోతోంది’ అని మంత్రి పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న శాఖల కింద 10 లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్టు గడ్కరీ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ చేశారు. హైవేలు, షిప్పింగ్, పోర్టులు, నదుల అభివృద్ధి, జలవనరుల శాఖ కింద చేపట్టిన ప్రాజెక్టుపై వెల్లడించేందుకు గణాంకాలతో సహా సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.‘ఈ శాఖల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. నా ఒక్కడి శాఖల్లోనే కోటి మందికి ఉద్యోగాలు లభించాయి’ అని ఆయన తెలిపారు. 50 వేల నుంచి లక్ష వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికిందని హైవేల మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. తమ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులు, ఎందరికి ఉపాధి కల్పించింది సంబంధిత గణాంకాలు సేకరిస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించి పలు అంశాలను ఆయన వివరించారు.
‘మేం కాశ్మీర్‌లో నిర్మిస్తున్న సొరంగం పనిలో రెండువేల మంది యువత పనిచేస్తోంది. అలాగే జిజోలా టనె్నల్‌లో 4వేల కంటే ఎక్కువ మందే కాశ్మీర్ యువత పనిచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది’ అని మంత్రి స్పష్టం చేశారు. వాప్‌కాస్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ 50వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మంత్రి మీడియాతో ముచ్చటించారు. గంగానది శుద్ధి కార్యక్రమంలో సంస్థ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు.