జాతీయ వార్తలు

ముంబయ మళ్లీ మునిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి, జూలై 3: దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో భారీ వర్షాలతో ప్రజాజీవితం అతలాకుతలమైంది. రైళ్లు, విమాన, బస్సు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్బన్‌లోని అంధేరీ వద్ద రైలు మార్గంపై రోడ్డు పై వంతెన కూలిపోవడంతో లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెన కూలడంతో ఐదుగురికి గాయలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పశ్చిమ రైల్వే జోన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ వంతెనను 1971లో నిర్మించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారణకు ఆదేశించారు. ట్రాక్ మరమ్మత్తులు వెంటనే చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలన్నారు. అంథేర రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు వంతెనపై భాగం కొంత కూలడంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపినట్లు రైల్వే మంత్రి ట్వీట్ చేశారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ వెంటనే నివేదిక పంపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ముంబాయినగరంలో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు లంచ్ బాక్స్‌లను డబ్బావాలాలు సరఫరా చేయలేకపోయారు. కాగా మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని నగరపాలక సంస్ధను, పోలీసు శాఖను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. రోడ్డు వ్యవస్థ బాగా ఉన్న ప్రాంతాల్లో బస్సు సర్వీసులను ఎక్కువగా నడపాలని కోరారు. కాగా అంథేరీ రైల్వే స్టేషన్ వద్ద ఘటన ఉదయం 7.30 గంటలకు జరిగిందని, విపత్తు యాజమాన్య నిర్వహణ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టినట్లు నగర పాలక సంస్థ అధికారులు చెప్పారు. నగరమంతా వంతెనల పనితీరు మదింపు పనికి ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ వంతెన కూలిన ఘటనలో బాధితులను నగర మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ పరామర్శించారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లనే రోడ్ వోవర్ బ్రిడ్జి కూలిందని విమర్శించారు.
ముంబాయిలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని, వంతెన కూలిన ఘటన బాధాకరమని, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పనిచేస్తుందా అని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. నగరపాలక సంస్ధ, రాష్ట్రప్రభుత్వం పని చేయడం లేదని, ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించడంలో వ్యవస్థలు విఫలమయ్యాయన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శాంతాక్రజ్‌లో గత 24 గంటల్లో 131 ఎంఎం, దక్షిణ ముంబాయిలోని కొలాబాలో 75 ఎంఎం వర్షపాతం నమోదైంది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు హెచ్చరికలను జారీ చేస్తున్నామని వాతావరణ శాఖ పేర్కొంది. తమ విమాన సర్వీసులను మళ్లించినట్లు కొన్ని విమానయాన సంస్థలు తెలిపాయి.