జాతీయ వార్తలు

గ్రాంట్ రోడ్ స్టేషన్ బ్రిడ్జికి పగుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 4: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటన మరువకముందే సౌత్‌ముంబయిలోని గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్‌లోని బ్రిడ్జికి ఏర్పడిన పగుళ్లను అధికారులు గుర్తించారు. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి ట్రాఫిక్‌ను మళ్లించినట్టు అధికారులు తెలిపారు. బ్రిడ్జిపై పగుళ్లను నిన్న రాత్రి 11.30 గంటలకు గమనించామని, దీంతో ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్‌ను మళ్లించామని బ్రిహన్ ముంబయి కార్పొరేషన్ (బిఎంసి) ప్రకటించింది. ట్రాపిక్‌ను కెనడీ బ్రిడ్జి మీదుగా నానా చౌక్‌కు దారి మళ్లించినట్టు, బిఎంసి ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో తెరుస్తామని ముంబయి పోలీస్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్) అమితేష్ కుమార్ తెలిపారు. బిఎంసి అధికారులు, ఇంజనీర్లు బ్రిడ్జిని పరిశీలించిన తర్వాత వారి ఆదేశాల మేరకు బ్రిడ్జిని ఉపయోగంలోకి తెస్తామని ఆయన చెప్పారు. ఇలావుండగా బిఎంసికి చెందిన బ్రిడ్జి శాఖ ఇంజనీర్లు ప్రస్తుతం ఆ బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించాల్సిందిగా బిఎంసి అధికారులు ఆదేశించారు. అంధేరిని సందర్శించిన రైల్వే మంత్రి పియూష్ గోయల్ రాబోయే ఆరు నెలల్లో బిఎంసి, ఐఐటి కలిసి ముంబయిలోని 445 ఆర్‌ఓబి, ఎఫ్‌ఓబిలను పరిశీలించి నివేదిక అందజేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రాంట్ రోడ్ స్టేషన్ బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడటంతో అధికారులు తమ చర్యలు వేగవంతం చేశారు. ఈ బ్రిడ్జిని పరిశీలించి వాటికి మరమ్మతులు చేపట్టాలా, లేక తిరిగి నిర్మించాలా తదితర అంశాలను వారు యోచిస్తారు. సాధారణంగా వీటికి స్వల్ప మరమ్మతులు అవసరమవుతాయని, లీకేజీలు, టైల్స్ వంటి వాటికి మరమ్మతులు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.