జాతీయ వార్తలు

రుణమాఫీ చేస్తేనే రైతులకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ, జూలై 5: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీకి ప్రాధాన్యత ఇస్తామని, దేశవ్యాప్తంగా వస్తు సేవా పన్ను కింద ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్‌టీ విధానం కింద ఒకే పన్ను విధించే కొత్త పద్ధతిని అమలు చేస్తాం. జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలు, డీజిల్‌ను తెస్తాం. ప్రస్తుతం పెట్రోలు, డీజీల్ జీఎస్‌టీ పరిధిలో లేనందు వల్ల వీటి రేట్లు పెరగడంపై ప్రజలపై మోయలేని ఆర్థిక భారం పడింది, అని ఆయన అన్నారు. గురువారం ఆయన అమేధిలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా గౌరీగంజ్ తాలాఖజూరి గ్రామంలో ముక్త్‌నాథ్ ఇంటర్ కాలేజీలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, రైతులకు న్యాయం చేయాలంటే రుణాలను మాఫీ చేయాలన్నారు. కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రూ.34వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. రైతాంగానికి న్యాయం చేయాలని కేంద్రంపై వత్తిడి తెస్తున్నామన్నారు. ఈ దేశంలో ధనవంతులైన వారి రుణాలను మాఫీ చేస్తుండగా లేనిది, రైతుల రుణాలను మాఫీచేస్తే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. అమేథీలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ నెలకొల్పకుండా, ప్రధాని నరేంద్రమోదీ వేరే చోటికి తరలించారన్నారు. నోయిడాలో బాబా రాందేవ్ ఫుడ్ పార్కు వస్తోందన్నారు. ఇక్కడ కచ్చితంగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీని వల్ల ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. అతి పెద్ద్ఫుడ్‌పార్కును ఏర్పాటు చేసి తానే ప్రారంభిస్తానన్నారు. రైతులకు సాంకేతిక విధానాలపై శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సంక్షేమ పథకాలు చేపట్టకపోతే, దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చుట్టూ ఎప్పుడూ 10 నుంచి 15 మంది అధికారులు ఉంటారని, వారి చెప్పిన మాట వింటారని, రైతుల మొరను ఆలకించరని ఆయన ఎద్దేవా చేశారు. అంతకుముందు ఆయన గౌరీగంజ్‌లో జనతా దర్భార్‌ను నిర్వహించారు. ఇక్కడ ప్రజలు తమ నియోజకవర్గం సమస్యలను విన్నవించారు. కాగా రాహుల్ గాంధీని సంజయ్ సింగ్ , అతని భార్య అమీత్ సింగ్ కలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై చర్చలు జరిపినట్లు సంజయ్ సింగ్ విలేఖర్లకు చెప్పారు. బీజేపీ సినియర్ నేత రామ్ లక్ష్మణ్ పస్సీ కుమార్తె సంగీత ఆనంద్ కూడా రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కాగా ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్ల హత్యాకాండకు బలైన అనిల్ వౌర్య ఇంటికి రాహుల్ గాంధీ వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.