జాతీయ వార్తలు

రూ.34వేల కోట్ల రైతు రుణాల మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 5: కర్నాటకలో రూ. 34వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ప్రకటించారు. అదే సమయంలో విద్యుత్, ఇంధనం చార్జీలను భారీగా పెంచారు. గురువారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, రైతుల రుణాలను మాఫీ చేయాలన్న సంకల్పాన్ని అమలు చేశామన్నారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రుణ మాఫీ వల్ల తలెత్తిన లోటును భర్తీ చేసేందుకు విద్యుత్, పెట్రోలు, డీజిల్, మద్యంపై పన్నులను పెంచినట్లు ఆయన చెప్పారు. రైతులరుణాలకు సంబంధించి రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశామన్నారు. 2017 డిసెంబర్ 31వ తేదీ వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు జేడీఎస్ పార్టీ తమకు అధికారం అప్పగిస్తే, 24 గంటల్లో రూ.54వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయం విదితమే. అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ, రూ.25వేల వరకు రుణాలను చెల్లించిన రైతులకు వారి ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తామన్నారు. ఆదాయం పన్నునుచెల్లించే రైతులు, వ్యవసాయం ఉన్న ప్రభుత్వ, సహకార రంగ ఉద్యోగులకు రుణ మాఫీ వర్తించదని ఆయన చెప్పారు. కాగా పెట్రోలు, డీజీల్‌పై లీటర్‌కు పన్ను రేటును వరుసగా రూ. 1.14, రూ. 1.12 పైసల చొప్పున పెంచుతున్నట్లు చెప్పారు. విద్యుత్ టారిఫ్‌పై పన్నును ఆరు నుంచి తొమ్మిది శాతం పెంచినట్లు ఆయన చెప్పారు.
భారత్‌లో తయారవుతున్న విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్)పై నాలుగు శాతం అదనంగా ఎక్సైజ్ డ్యూటీని విధించారు. మోటార్ వాహనాల పన్నును అదనంగా 50 శాతం పెంచారు. క్యాప్టివ్ ఎనర్జీ టారిఫ్‌నుకూడా పెంచారు. యూనిట్‌కు 20 పైసల చొప్పున పెంచారు. రైతుల రుణాలను మాఫీ చేసిన తర్వాత వారికి బకాయిలను చెల్లించినట్లు ధృవపత్రాలను ఇస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు.