జాతీయ వార్తలు

ఎన్డీయేకి జేడీ(యూ) గుడ్‌బై?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: తెలుగుదేశం, శివసేన మాదిరిగా జేడీ(యూ) కూడా బీజేపీకి గుడ్‌బై చెబుతుందా? జేడీ(యూ) ఆదివారం తీసుకునే నిర్ణయం బిహార్ రాజకీయాల్లో కీలక మలుపు కానుందా? అవుననే అంటున్నారు రాజకీయ విశే్లషకులు. జేడీయూ జాతీయ కార్యవర్గం ఆదివారం ఢిల్లీలో సమావేశమై 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలా లేక స్వతంత్రంగా ముందుకు సాగాలా అనే అంశంపై లోతుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసే ప్రకటన బిహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చేస్తుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 12న పాట్నాలో నితీశ్ కుమార్‌తో సమావేశమై లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై బీజేపీ, జేడీ(యూ) మధ్య విభేదాలు తలెత్తాయి. బీజేపీతో పొత్తు కొనసాగాలా వద్దా, కొనసాగే పక్షంలో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? అనే అంశంపై జేడీ(యూ) జాతీయ కార్యవర్గంలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు. నితీశ్ కుమార్ ఇప్పుడిప్పుడే బీజేపీతో పొత్తు వదులుకునే స్థితిలో లేరు. ఆర్‌జేడీతో సమస్యలు ఎదురైనందుకే ఆయన బీజేపీ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న మరుక్షణం నితీశ్ కుమార్ ప్రభుత్వం పతనం కావడం ఖాయం. అలాగని బీజేపీతో పొత్తు కొనసాగిస్తే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని యాదవులు, మైనారిటీలు జేడీ(యూ)కు ఓటు వేయరనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఆచితూచి అడుగులేస్తూ, మొత్తం వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా నడిపిస్తున్నారు. నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో సమావేశమై బిహార్ రాజకీయాల గురించి చర్చిస్తారు. ఈ చర్చలు ఇరుపక్షాలకు సంతృప్తినిస్తే నితీశ్ కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశం అవుతారని జేడీ(యూ) వర్గాలు చెబుతున్నాయి.