జాతీయ వార్తలు

అదో ‘బెయిల్ గాడీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 7: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవీళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ ‘బెయిల్ గాడీ’ గా తయారైందని, ఆ పార్టీకి సీనియర్ నేతలందరూ బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌లో శిఖర సమానులమనుకునే నాయకులంతా కోర్టుల నుంచి బెయిల్ తీసుకుని కాలక్షేపం చేస్తున్నారు. వీరిలో కేంద్ర మాజీమంత్రులు కూడా ఉన్నారు’ అని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఆరు నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఇక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. జైపూర్ ర్యాలీతో నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లయింది. ఎటువంటి పరిస్థితుల్లో అవినీతిని సహించే ప్రసక్తిలేదని, అవినీతిని పారదోలేవరకు విశ్రమించమని ఆయన స్పష్టం చేశారు. నవ భారత నిర్మాణామే బీజేపీ ముందున్న లక్ష్యమని, ఈ ఆశయ సాధనకు ప్రతి భారతీయ పౌరుడు అంకితభావంతో కృషి చేసేందుకు సమాయత్తం చేస్తున్నామని ఆయన ఉద్వేగంతో అన్నారు.
నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీని బెయిల్ గాడీగా పేర్కొనడం చూస్తే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని రానున్న రోజుల్లో దాడిని తీవ్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు భావించవచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసుల్లో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భార్య సునంత పుష్కర్ మృతి కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బెయిల్‌కు లభించిన విషయం విదితమే. జమ్ముకాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిబుద్ది చెప్పేందుకు మన జవాన్లు సర్జికల్ దాడులు చేసినా కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తూ పోరాడుతున్న జవాన్ల పటిమనే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందా అని ఆయన విమర్శించారు. మన ఆర్మీ ప్రతిభాపాటవాలను తక్కువ చేసే మాట్లాడడం సరికాదని ఆయన కాంగ్రెస్‌కు హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ తన బుద్ధిని మార్చుకోని పక్షంలో ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు. అధికారం కోసం నీచ రాజకీయాలకు పాల్పడరాదని ఆయన అన్నారు. బీజేపీకి దేశాన్ని అభివృద్ధి చేయడం కంటే మించిన అజెండా ఏమీ లేదన్నారు. రాజస్తాన్ ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి వసుంధరా రాజే మార్చివేశారని ఆయన కితాబునిచ్చారు. ఆమె హయాంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. రాజస్తాన్ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి మార్గదర్శిగానిలిచిందన్నారు. వచ్చే ఏడాదికి రాజస్తాన్ రాష్ట్ర అవతరించి 70ఏళ్లు పూర్తవుతుందన్నారు. 2013లో రాష్ట్రం అన్ని సంక్షోభాల్లో ఉన్నప్పుడు వసుంధరారాజే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రగతికి బాటలు వేశారన్నారు.