జాతీయ వార్తలు

ఉన్నత విద్య.. అందని ద్రాక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూలై 7: ప్రపంచంలో మూడవ అతి పెద్ద విదా వ్యవస్థ భారత్‌లో ఉన్నా, ఇప్పటికీ ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్షగా మిగిలిందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. శనివారం ఇక్కడ ఆయన గోవా విశ్వవిద్యాలయం 30వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో కొత్త విద్యా సంస్థలను నెలకొల్పాలన్నారు. ఈ సంస్థల్లో ఉన్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో ఇప్పటికీ యువతీయువకులకు ఉన్నత విద్య సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సమిష్టి బాధ్యతతో పనిచేయాలన్నారు. యువతకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురాని పక్షంలో ఆశించిన ఫలితాలు రావన్నారు. ఇంతవరకు భారత్ ఈ రంగంలో చేసిన కృషి శ్లాఘనీయమని, కాని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యా సంస్థలను పెద్ద సంఖ్యలో నెలకొల్పాలన్నారు. జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఐఐటీలు, ఇతర విద్యా సంస్థలను ఉన్నత విద్యా ప్రమాణాలతో నెలకొల్పారని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ పెరిగింది. పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఉన్నత విద్య రంగంపై యువత ఎక్కువ ఆశలుపెట్టుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు స్పందించి ఈ రంగాన్ని మెరుగుపరచాలన్నారు. యూనివర్శిటీల్లో క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేయాలని, విజ్ఞాన కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దాలన్నారు. పుస్తకాల్లో నాణ్యత ఉంటే ఉపయోగం లేదు. బోధించే అధ్యాపకుల తీరులో కూడా మంచి మార్పు రావాలని ఆయన అన్నారు. వర్శిటీలు మంచి ఉన్నత విద్యను వ్యాపింపచేసేందుకు జాతి పునర్నిర్మాణంలో కీలకపాత్ర వహించే విధంగా విద్యార్థులకను కార్యోన్ముఖులను చేసేందుకు కదలాలని ఆయన కోరారు. సమాజంలో మంచి మార్పు సాధనకు వర్శిటీలు కృషి చేయాలన్నారు. ఉన్నత విద్యను ఎక్కువ మంది యువతులు చదివే విధంగా ప్రణాళికను ఖరారుచేయాలన్నారు. గోవా ప్రభుత్వం బాలికా విద్య అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. గోవా వర్శిటీలో విద్యార్థినులు చూపిన ప్రతిభ ఆశ్చర్యమేస్తుందని ఆయన ప్రశంసించారు. 67 బంగారు పతకాల్లో 41 పతకాలను విద్యార్థినులు సాధించారన్నారు. గోవా విద్యార్థినుల ప్రతిభ దేశంలోని బాలికలకు ఆదర్శమన్నారు. మనం నేర్చుకున్న విద్య ఫలాలను సమాజానికి అభివృద్ధి రూపంలో ఇవ్వాలన్నారు. విద్య సాధికారత లక్ష్యాన్ని సాధించేందుకు దీక్షతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, వర్శిటీ చాన్సలర్ మృదుల సిన్హా, ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పాల్గొన్నారు.