జాతీయ వార్తలు

పరిరక్షిస్తారా.. కూల్చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: తాజ్ మహల్ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ (యూపీ) సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. పరిరక్షిస్తారా? లేక కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కట్టడాన్ని పరిరక్షించేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్‌ను యుపీ ప్రభుత్వం రూపొందించకపోవడం పట్ల కోర్టు మండిపడింది. ప్రభుత్వం తీరు నిరాశజనకంగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ మహత్తర కట్టడాన్ని పరిరక్షించే విషయమై, కాలుష్యం బారినపడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు ఈ నెల 31వ తేదీ నుంచి ఈ కేసును రోజూవారీ విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘తాజ్ మహల్‌ను మీరు మూసివేస్తారా, కూల్చివేస్తారా, లేక పరిరక్షిస్తారా’ అని ధర్మాసనం నిలదీసింది. తాజ్ మహల్ పరిరక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తగిన ఆదేశాలు ఇచ్చినా యుపీ ప్రభుత్వం పట్టించుకోకుండా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాజ్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. తాజ్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిపై అధ్యయనం జరుగుతోందని, మరో నాలుగు నెలల్లో ఈ పని పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఈ అధ్యయనాలు చేపట్టిందని కోర్టుకు తెలిపారు. కాలుష్య పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని తాజ్‌ను కాపాడుకుందామనే ఆత్రుత కనపడడం లేదని వ్యాఖ్యానించింది. తాజ్ ఒక అద్భుతమైన కట్టడమని, ఈఫిల్ టవర్ కంటే అందమైనదని పేర్కొంది. ‘ఈఫిల్ టవర్‌ను సాలీనా 80 మిలియన్ల ప్రజలు చూసేందుకు వెళుతున్నారు. అంతకంటే అందమైనది మన తాజ్ మహల్. ఈఫిల్ టవర్ చూసేందుకు టీవీ టవర్‌లా ఉంటుంది. తాజ్ మహల్‌ను అందంగా తీర్చిదిద్దితే విదేశీమారకద్రవ్యం కూడా వస్తుంది’ అని కోర్టు పేర్కొంది. అనంతరం కోర్టు ఈ నెల 31వ తేదీ నుంచి కేసును విచారిస్తామని పేర్కొంది.