జాతీయ వార్తలు

మహిళా రిజర్వేషన్లకు బేషరతు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బేషరతు మద్దతు ప్రకటించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇరకాటంలో పడవేశారు. మహిళల సాధికారితకోసం పోరాడుతున్నానని చెప్పుకునే నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం సంపాదిస్తారా? తమ పార్టీ ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తోంది అంటూ రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. బుధవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపాదిస్తే తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందంటూ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రికి సోమవారం లేఖ రాశారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడితే సరిపోదు, చేతల్లో చూపించాలని రాహుల్ ప్రధానికి సవాల్ చేశారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని రాహుల్ లేఖలో సూచించారు. చట్టసభల్లో మహిళలకు సీట్లు రిజర్వు చేసేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజ్యసభ 2010 మార్చిలో ఆమోదించటం మీకు తెలిసిందే. అయితే ఏదో ఒక కారణంతో లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించలేదని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించినప్పుడు ఇది చారిత్రాత్మిక నిర్ణయమని అప్పటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ మద్దతుతోనే రాజ్యసభలో మహిళా బిల్లుకు అమోదముద్ర పడిందనే విషయం మరిచిపోరాదని కాంగ్రెస్ అధ్యక్షుడు సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ మొదటి నుండీ ఒకే విధానాన్ని అవలంభిస్తుంటే బీజేపీ మాత్రం ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోందని రాహుల్ విమర్శించారు. బీజేపీకి చెందిన కొందరు మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారని, వారందరికీ మోదీ నచ్చజెప్పాలని సూచించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం వలన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సుపరిపాలన వస్తోందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే దేశం మొత్తం మీద సుపరిపాలన నెలకొనేందుకు అవకాశం ఉన్నదని రాహుల్ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ పలు బహిరంగ సభల్లో మహిళల సాధికారిత గురించి మాట్లాడుతున్నారు.. మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించటం ద్వారా మోదీ తన చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లును ప్రతిపాదించటంలో ఏమాత్రం జాప్యం చేసినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేయటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు మెజారిటీ ఉన్నందున బిల్లుకు సులభంగా ఆమోదముద్ర పడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. మహిళా బిల్లుకు అనుకూలంగా కాంగ్రెస్ సేకరించిన సంతకాలను మీకు అందజేసేందుకు తాము సిద్దమేనని ఆయన చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని రాహుల్ స్పష్టం చేశారు. మహిళా సాధికారత విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా వ్యవహరించటం మంచిదని ఆయన హితవు చెప్పారు.