జాతీయ వార్తలు

ఒక్కటైన విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంటు సమావేశాలకు అడ్డుపడే ప్రసక్తే లేదు.. ఉభయ సభలు ప్రశాంతంగా కొనసాగాలనే ఏకాభిప్రాయాన్ని అన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేశాయి. ఉభయ సభలను కొనసాగించుకుంటూ ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పులను గట్టిగా ఎత్తి చూపించాలని పదమూడు ప్రతిపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి.. అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదనే భావన కలుగుతోంది అని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. పార్లమెంటులోని ఆజాద్ కార్యాలయంలో విపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు సోమవారం సమావేశమై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహమద్ పటేల్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో పార్టీ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ, జ్యోతిరాధిత్య సింధియా, ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్, టీఎంసీ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్, బీఎస్‌పీ సీనియర్ నాయకుడు సతీష్ చంద్ర, ఎస్పీ నాయకుడు రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి, డీఎంకే నాయకుడు ఎలంగోవన్, సీపీఎం సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం, సీపీఐ నాయకుడు డి.రాజా, జేడీ(యస్) నాయకుడు కుపేంద్ర రెడ్డి, ఆర్‌ఎస్‌పీ నాయకుడు ప్రేమచంద్రన్, ఏసీఎం నాయకుడు జోస్ కె మణి, యుఎంఎల్ నాయకుడు కునాలి కుట్టి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ఏ అంశాలను లేవనెత్తాలనేది నిర్ణయించాం, మంగళవారం ప్రభుత్వం ఏర్పాటుచేసే అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావిస్తామని ఆజాద్ సమావేశానంతరం విలేఖరులతో చెప్పారు. ఉభయ సభలు సజావుగా కొనసాగాలంటూ పదమూడు ప్రతిపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని ఆజాద్ చెప్పారు. గత పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకున్నాయి అయితే ప్రభుత్వం సభా కార్యక్రమాలకు అడ్డుపడి ప్రతిపక్షాలను అపఖ్యాతిపాలు చేశాయని ఆజాద్ ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన కొన్ని పక్షాలు వ్యవహరించిన తీరు మూలంగానే గత పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగలేదని ఆయన చెప్పారు. ఎన్‌డీఏ మిత్రపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటే తమకు చెడ్డపేరు వచ్చింది.. అందుకే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తాము ఎలాంటి గొడవ చేయం.. చర్చల సందర్భంగా ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిస్తామని ఆజాద్ ప్రకటించారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, బీసీలు, మైనారిటీల సమస్యలు ప్రస్తావిస్తాం, విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావిస్తామన్నారు. చర్చల సందర్భంగా గొడవ జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై సభలో చర్చ జరపాలనుకుంటున్నాం.. ప్రభుత్వం చర్చలకు అనుమతి ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలని ఆజాద్ చెప్పారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరపాలని సమావేశంలో డిమాండ్ చేయనున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు ఆజాద్ చెప్పారు.