జాతీయ వార్తలు

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసోర్, న్యూఢిల్లీ, జూలై 16: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్‌ను సోమవారం ఒడిసాలోని బాలసోర్ కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించారు. క్షిపణి జీవితకాలం పొడిగింపునకు తోడ్పడే సాంకేతికతను పరీక్షించే ధ్యేయంతో చేపట్టిన ఈప్రయోగ పరీక్షను మొబైల్ అటానమస్ లాంచర్ ద్వారా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ ద్వారా 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించవచ్చు. దీనిని భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు. చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి యుద్ధ భయం నేపథ్యంలో భారత్ రక్షణ వ్యవస్థకు ఈ క్షిపణి మనకు తిరుగులేని అస్త్రంగా నిలుస్తుంది. ఉదయం 10.17 గంటలకు నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని, వాతావరణం అనుకూలంగా లేకపోయినా, సముద్రంలో ఏడు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ క్షిపణి తన సత్తా చాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శాస్తవ్రేత్తలను, అధికారులను అభినందించారు. డిఆర్‌డిఏ అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బ్రహ్మోస్ ప్రయోగ పరీక్షను వీక్షించారు. గతంలో బ్రహ్మోస్‌ను ఈ ఏడాది మే 21, 22 తేదీల్లో పరీక్షించారు. డిఆర్‌డిఓ, రష్యాకు చెందిన ఎన్‌పిఓఎం కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మల్టీరోల్, మల్టీ ప్లాట్‌ఫాం, ఏంటీషిప్ సామర్థ్యాలు కలిగి ఉంది. ఇది భారతదేశ రక్షణ వ్యవస్థకు పెద్ద అండగా పేర్కొనవచ్చు.