జాతీయ వార్తలు

తక్షణం చేనేత క్లస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: తెలంగాణ వ్యాప్తంగా చేనేత కార్మికులను అదుకొనేందుకు 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంత్రి కేటీఆర్ కేంద్ర జౌళి శాఖమంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు గురించి మంత్రి స్మృతి ఇరానీతో చర్చించినట్టు ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం హ్యాండ్లూమ్, పవర్‌లూం రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్మృతి ఇరానీకి వివరించానని ఆయన అన్నా రు. నేతన్నకు చేయూత నిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకాల గురించి కూడా వివరించానని తెలిపారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నామని, చేనేత రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని నూతన హ్యాండ్లూమ్ కస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఖమ్మం, మహాబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్లస్టర్సు ఏర్పాటు చేయానున్నామని, ఇవే కాకుండా మరో 10 క్లస్టర్లను మంజూరు చేయావల్సిందిగా మంత్రి స్మృతి ఇరానీని కోరానని ఆయన తెలిపారు. చేనేత క్లస్టర్ల ఏర్పాటు కోసం కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, జాప్యం జరుగుతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్ళానని వెల్లడించారు. తాము చేసిన విజ్ఞప్తులకు స్మృతి ఇరానీ సానుకులంగా స్పందించినట్టు కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి: హరీశ్‌రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హరీశ్‌రావు గడ్కరీతో సమావేశం అయ్యారు. అనంతరం హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, ఒకసారి ప్రాజెక్టును సందర్శించాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరినట్టు చెప్పారు. కేంద్రమంత్రి గడ్కరీ చొరవతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని, దీనికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసినట్టు హరీశ్‌రారావు తెలిపారు.