జాతీయ వార్తలు

రాహుల్ కప్పదాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ ముస్లింల పార్టీ అవునా కాదా అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎందుకు స్పష్టం చేయటం లేదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవి అంటేనే ఇష్టం తప్ప ప్రజలు కాదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌ను ముస్లింల పార్టీగా మార్చివేశారని సంబిత్ పాత్రా దుయ్యబట్టారు. సంబిత్ పాత్రా మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ కుట్ర ప్రకారమే కాంగ్రెస్ ముస్లింల పార్టీ అనే సందేశాన్ని మైనారిటీ వర్గాల్లోకి పంపిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ముస్లిం మైనారిటీ మేథావులతో సమావేశం జరిపారు.
ఆ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని వారితో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రాహుల్ దీనిపై ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ ముస్లిం పార్టీ అవునా, కాదా అనేది స్పష్టం చేయకుండా తానే కాంగ్రెస్ అని ప్రకటించారు. ఈ ట్వీట్‌పై పాత్రా స్పందిస్తూ కాంగ్రెస్ ముస్లిం పార్టీ అనే విషయంపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని పాత్రా నిలదీశారు. ఈ విధంగా రాహుల్ మతరాజకీయం చేస్తున్నారని పాత్రా ఆరోపించారు. కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీగా ప్రకటించి దేశం లౌకిక విధానాన్ని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. నిర్జీవ పదవిని ప్రేమించే రాహుల్ సజీవుల పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని ఆయన దుయ్యబట్టారు. భారతదేశం అంటే ఇందిర.. ఇందిర అంటే భారతదేశం.. అంటూ గతంలో ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రకటించినట్లు ఇప్పుడు రాహుల్ గాంధీ తనను తాను కాంగ్రెస్‌గా ప్రకటించుకోవటం విచిత్రంగా ఉన్నదని సంబిత్ ఆరోపించారు.
ఒవైసీపై విమర్శలు
భారత సైన్యం, సీఆర్‌పీలో ఎంతమంది ముస్లింలకు స్థానం కల్పించారంటూ ఎంఐఎం లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించటాన్ని సంబిత్ పాత్రా ఖండించారు. సైన్యానికి మతం రంగు పులమటం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. సైన్యంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారని ప్రశ్నించటం మహమ్మద్ అలీ జిన్నా రాజకీయానికి నిదర్శమని అన్నారు. సైన్యంలో ముస్లింల ప్రాతినిథ్యం ఆశించినంత లేదని కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ గతంలో చేసిన ప్రకటనను గుర్తుచేస్తూ కాంగ్రెస్, ఎంఐఎం విభజన రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.