జాతీయ వార్తలు

ప్రశాంతంగా పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంటు ఉభయ సభలు చాలా ఏళ్ల తర్వాత సజావుగా మొదలయ్యాయి. తెలుగుదేశం, ఎస్పీ సభ్యులు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో నినాదాలిస్తూ గొడవ చేశారు. అయితే అది శ్రుతిమించ లేదు. రాజ్యసభలోనూ తెలుగుదేశం సభ్యులు తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుపట్టటంతో 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఈ రెండు సంఘటనలు మినహా ఉభయ సభల్లో ఇతర ఏ రకమైన గొడవా జరగలేదు. ఉభయ సభల్లో బుధవారం పూర్తిగా చర్చలు జరిగాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో గంటపాటు నినాదాలిచ్చారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలపటంతో వారి గొడవ కూడా సద్దుమణిగింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నినాదాల మధ్య కొనసాగినా ఆ తరువాత జీరో అవర్, బిల్లులపై చర్చ ఎలాంటి గొడవ లేకుండా సజావుగా జరిగాయి.
రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రభుత్వ పత్రాల సమర్పణ తరువాత జీరో అవర్ ప్రారంభం అవుతున్న సమయంలో టీడీపీ సభ్యులు సీఎం రమేష్, సుజానా చౌదరి తామిచ్చిన వాయిదా తీర్మానాల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ప్లకార్డును ప్రదర్శించారు. వారి గొడవ మూలంగా రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తరువాత రమేష్, సుజనా చౌదరికి నచ్చజెప్పటంతో వారు శాంతించారు. అనంతరం సభా కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాయంత్రం వరకు కొనసాగాయి. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభలు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగాయి. అజెండాలో పొందుపరిచిన మేరకు చర్చలు జరిగాయి.