జాతీయ వార్తలు

లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలపడాన్ని ఆ పార్టీ ఎంపీలు స్వాగతించారు. తోట నరసింహం, సుజనా చౌదరి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయని, ఆ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభలో జరిగే చర్చద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిలదీసేందుకు ఉపయోగించుకుంటామని ఎంపీలు స్పష్టం చేశారు. కేశినేని నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అమోదం తెలపడం తెలుగు ప్రజల విజయమని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరగనున్న చర్చలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు. మూడు రోజులుగా చక్కని వ్యూహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలను ముందుకు నడిపించారని కేశినేని తెలిపారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోదనే విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ అర్థం చేసుకున్నారని అందుకే అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. తమ పార్టీ అవిశ్వాసానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం ‘తమ అధినేత చంద్రబాబుపై ఉన్న నమ్మకానికి నిదర్శనం’గా వ్యాఖ్యనించారు.
టీడీపీ, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ -- వైఎస్సార్‌సీపీ నేత సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ, జూలై 18: కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఓట్లకోసం తెలుగుదేశం, బీజేపీ పార్లమెంట్ సాక్షిగా డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. గత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ 13సార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చినా స్పీకర్ అనుమతించలేదని, తమ రాజీనామాలకు అమోదం తెలిపి, ఈ సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించడం ఏంటమి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి 50మందికి పైగా సభ్యుల మద్దతున్నా స్పీకర్ అవకాశం ఇవ్వలేదని అన్నారు. తెలుగుదేశం-బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే అవిశ్వాస తీర్మానానికి అనుమతి లభించిందని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి పనిచేసి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగి ఏనాడూ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు చిత్తశుద్ధితో హోదాకోసం, విభజన హామీలకోసం అన్ని విధాలుగా పార్లమెంట్ లోపాలా, బయటా పోరాటం చేశామని అన్నారు. ఏపీ హక్కులకోసం ఆమరణదీక్ష చేశామని, రాజీనామాలు కూడా చేశామని గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్లుగా చేసిన పోరాటాలవల్లే హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.