జాతీయ వార్తలు

ఆర్నెల్లే గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: లోక్‌పాల్,లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతోపాటు రైతాంగ సమస్యల పరిష్కరించడంలోనూ సత్వర చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం తన ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. హజారేతో చర్చలు జరిపే విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిగా వ్యవహరించారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి ఆయన రామ్‌లీలా మైదాన్‌కు వెళ్లి హజారేతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఫడ్నవీస్ హజారే డిమాండ్ల విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. ప్రధాన మంత్రి కార్యాలయం అందించిన లేఖను మంత్రి షెకావత్ చదివి వినిపించారు. అలాగే ఎన్నికల సంస్కరణలకు సంబంధించి హజారే లేవనెత్తిన అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ సానుకూల ప్రతిస్పందన నేపథ్యంలో తాను దీక్షను విరమిస్తున్నప్పటికీ ఆరు నెలల్లోగా వీటన్నింటినీ నెరవేర్చాలని హజారే అల్టిమేటం ఇచ్చారు. ఆగస్టులోగా తన డిమాండ్లు నెరవేర్చకపోతే మళ్లీ సెప్టెంబర్ నుంచి మరింత తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అందించిన కొబ్బరి నీళ్లుతాగి దీక్ష విరమించిన హాజరే తన డిమాండ్ల విషయంలో రాజీ ప్రసక్తేలేదని వెల్లడించారు. ఆర్నెల్ల కంటే ముందుగానే ఈ డిమాండ్లు పరిష్కరిస్తామని ఫడ్నవీస్ తనకు స్వయంగా తెలిపారని పేర్కొన్న హజారే‘ఇది ఎంత వరకూ నిజమవుతుంతో చూద్దాం’అని అన్నారు. ప్రభుత్వం, ప్రజలు వేరుకాదని ప్రజాసంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని అన్నాహజారే అన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమాలకు దిగేవరకూ పరిస్థితిని విషమింపచేయడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.