జాతీయ వార్తలు

హామీలు నెరవేర్చలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: విభజన హామీలను కేంద్రం నెరవేర్చకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో వినోద్ పలు అంశాలను ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం దుర్మార్గమని అన్నారు. ఈ మండలాలు ఆంధ్రలో కలపకపోతే, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు నాయుడు భీష్మించుకోవడంతో, ఆయనను బుజ్జగించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ హనీమూన్ కాలం ముగిసిందని వ్యా ఖ్యానించారు. ఖమ్మం జిల్లా నుంచి అన్యాయంగా ఆంధ్రలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. సీలేరు హైడల్ పవర్ స్టేషన్ ఉన్నందుకే ఆ ప్రాంతాన్ని ఆంధ్ర బలవంతంగా తీసుకుందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నదని, కష్టాలను మరింత పెంచే విధంగా హైడల్ పవర్ ప్లాంటును కూడా తీసుకోవడంతో కరెంటు సమస్యలు పెరిగాయన్నారు. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి విద్యుత్‌ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఇప్పుడు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించటాన్ని తాము వ్యతిరేకించటం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అయితే దీనికి నిధులు ఇచ్చే సమయంలో కేంద్రం తెలంగాణ గురించి ఆలోచించలేదన్నారు. తెలంగాణ సర్కారు గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు నదులపై నిర్మిస్తున్న ఏదోఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని వినోద్ డిమాండ్ చేశారు. మోదీ రాష్ట్రానికి ఏం ప్రకటిస్తారనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలం కేటాయించవలసి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో ఉక్కు కార్మాగారం నిర్మాణం ఏమైందని వినోద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో జాతీయ రహాదారుల శాతం పెరిగింది, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇంత వరకు ప్రారంభం కాలేదని ఆయన గుర్తుచేశారు. తెలంగాణకు హైకోర్టును ఇంత వరకు ఏర్పాటు చేయకపోవటం సిగ్గు చేటన్నారు. ఏపీ ముఖ్యమంత్రి మూలంగా తెలంగాణకు హైకోర్టు రావటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర శాసన సభ, సచివాలయాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించిన చంద్రబాబు నాయుడు హైకోర్టు కోసం భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే హైకోర్టు కోసం భవనాన్ని నిర్మించటం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్లు కేటాయించాలన్న తమ విజప్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం నిధులు ఇవ్వటం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి నిధులు ఇవ్వాలన్నా పట్టించుకో లేదని ఆయన విమర్శించారు. ఏపీకి నిధులు, పథకాలు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదుగానీ పన్ను రాయితీలు మాత్రం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటనేది బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని వినోద్ డిమాండ్ చేశారు. తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు.