జాతీయ వార్తలు

మోదీది పచ్చి మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపీ ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిందేమిటి? * లోక్‌సభలో నిప్పులు చెరిగిన గల్లా జయదేవ్
సభలో టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం
న్యూఢిల్లీ, జూలై 20: తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేని మనిషి మనిషే కాదం టూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ నరేంద్ర మోదీ పచ్చి మోసగాడు. అబద్దాల పుట్ట’అంటూ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం మోదీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చలో గల్లా జయదేవ్ పాల్గొన్నారు. చర్చను ప్రారంభించిన గల్లా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ‘విభజన హామీలను అమలు చేయకపోవటం జాతీయ సమస్య’ అన్నారు. ‘ఇది ధర్మ పోరాటం. ఫెడరల్ విధానంలో కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అయితే అలా జరగడం లేదు’ అని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా హామీలను అమలు చేయకపోతే ఏం చేయాలని గల్లా ప్రశ్నించారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోడానికి కేంద్రం చేయూతనివ్వదా?
అంటూ జయదేవ్ నిలదీశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రం సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తోందని తీవ్ర ఆరోపణ చేశారు.
కాగా యుపీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అశాస్ర్తియంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించిందని జయదేవ్ అనగానే, టీఆర్‌ఎస్ సభ్యులు లేచి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్, తెలుగుదేశం సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆస్తులు, అప్పుల పంపకంలో కూడా ఏపీకి అన్యాయం చేశారని టీడీపీ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ పట్ల పక్షపాతం చూపించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయని విమర్శించారు. అవిభాజిత రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి హైదరాబాద్ సంపదను సృష్టించారని, అయితే హైదరాబాద్ ఆదాయాన్ని పంపిణీ చేయటంలో ఏపీకి అన్యాయం చేశారని గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సహాయం, బుందేల్ ఖండ్ స్థాయి ప్యాకేజీ, బడ్జెట్ లోటు భర్తీ హామీలు ఏమయ్యాయని మోదీ సర్కార్‌ను నిలదీశారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన పేరుతో తెలుగు తల్లిని రెండు ముక్కలు చేసిందన్న నరేంద్ర మోదీ ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. మోదీ ఏపీని రక్షించే బదులు శిక్షిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌పై ఏ మాత్రం గౌరవం ఉన్నా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను పది సంవత్సరాలకు ఇస్తామని ప్రకటించిన మోదీ ఇప్పుడు మాట మార్చారని జయదేవ్ ఎద్దేవా చేశారు. ఏపీకి మోసం చేసిన బీజేపీని రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆయన హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌కు ఇలాంటి గతే పట్టించిన విషయం మరిచిపోరాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందంటూ అర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రజలను తప్పుదోవ పట్టించారని గల్లా ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సౌకర్యాలు కల్పిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అన్యాయం కాదా? మోసం కాదా? అని జయదేవ్ నిలదీశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చారనడం నిజం కాదన్నారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం దాన్నీ అమలు చేయలేదు. బడ్జెట్‌లో పొందుపరచలేదు కాబట్టే తిరిగి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాం’అని ఆయన వివరించారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాట మార్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని జయదేవ్ ఆరోపించారు. ఏడు వెనకబడిన జిల్లాలకు విడుదల చేసిన నిధులను రిజర్వు బ్యాంక్ వెనకకు తీసుకోవటం సిగ్గు చేటన్నారు. ఏపీ భవన్‌ను ఇంకా ఎందుకు విభజించలేదని అడిగారు. లోటు 16,078 కోట్లు అయితే కేంద్రం కేవలం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చిందన్నారు. తమకు 12 వేల కోట్లు రావలసి ఉండగా కేంద్రం 178 కోట్లు మాత్రమే ఇవ్వవలసి ఉందని చెప్పటం అన్యాయం కాదా? అని జయదేవ్ అన్నారు. చంద్రబాబును అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. రైల్వేజోన్, మెట్రో ఇవ్వడం లేదని విమర్శించారు.
కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని జయదేవ్ తేల్చేశారు. ‘ప్రజల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమనటం లేదు. మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నాం’అని టీడీపీ ఎంపీ స్పష్టం చేశారు. తలుపులు మూసి అప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాన్ని విభజించారని పదే పదే ఆరోపించారు. తమ రాజకీయ ప్రత్యర్థులతో బీజేపీ చేతులు కలుపుతోందని గల్లా విమర్శించారు.