జాతీయ వార్తలు

అర్థం లేని అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాహజహన్‌పూర్ (యుపీ), జూలై 21: విపక్ష పార్టీలు బీజేపీపై లోక్‌సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అర్థం లేదని, ఏ ఉద్దేశ్యంతో ఈ తీర్మానం పెట్టారో తెలియక ప్రతిపక్ష పార్టీలు అయోమయానికి గురయ్యాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఎఐసిసి అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత తన వద్దకు వచ్చి కౌగిలించుకోవడం అసందర్భమని, ఇది అనాలోచిత చర్య అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రజలు సహించరన్నారు. ప్రతి పక్ష పార్టీలకు దిశ, దశ లేదని, బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక అవిశ్వాసతీర్మానం పెట్టాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవిశ్వాసతీర్మానం ఎందుకు పెట్టారని అడిగితే, ఏమి చేయాలో తెలియక, తన సీటు వద్దకు వచ్చి కౌగిలించుకుని వెళ్లి అసందర్భమైన చర్యలకు కాంగ్రెస్ నేత పాల్పడ్డారని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ ఆయన బ్రహ్మాండమైన ర్యాలీలో మాట్లాడుతూ అభివృద్ధిపట్ల సరైన అవగాహన, చిత్తశుద్ధిలేని పార్టీల కలిసి అవిశ్వాస తీర్మానం ఇచ్చాయన్నారు. కమలం వికాసాన్ని, దేశాభివృద్ధిని విపక్ష పార్టీలు అడ్డుకోలేవన్నారు. ‘ ప్రతిపక్ష పార్టీలకు ఎంత సేపు ప్రధానమంత్రి కుర్చీపైనే ఆశ. ఈ పదవి కోసం కుమ్ములాడుకుంటారు. వీరికి పేదలు, యువత, రైతులంటే ప్రేమ లేదు. వీరి సంక్షేమం అక్కర్లేదు. వీరి చర్యల వల్ల అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీజేపీనే ప్రజలు ఆదరిస్తారు ’ అని ఆయన అన్నారు. లోక్‌సభలో శుక్రవారం జరిగిన ఘటనలు, విపక్ష పార్టీల ప్రసం గం చూసే ఉంటారని, విపక్షాలు దేశానికి ఏమి సందేశమిచ్చాయని ఆయన నిలదీశారు. ‘ తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పేదలు, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాను. నేనేమీ ఇంతవరకు ఏ తప్పు చేయలెలదు. అవినీతిపై యుద్ధం ప్రకటించాను. ఇదేనా నేను చేసిన నేరం ’ అని ఆయన ప్రశ్నించారు. రైతాంగ సంక్షేమానికి గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, వారి కష్టాలను ఏ ప్రభుత్వంకూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రైతాంగ సంక్షేమం కోసం పాటుపడుతుంటే, విపక్షాలు విమర్శించడమేంటన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి చక్కెర మిల్లులు మొలాసిస్ నుంచి ఇథనాల్ తయారు చేసేందుకు, చెరుకు రసం తయారుచేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. యుపీ రాష్ట్రంలో 80 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో ఈ రాష్ట్రంలో మోదీ పర్యటించడం ఇది మూడోసారి. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానం వీగిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన మోదీ తొలి ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.