జాతీయ వార్తలు

ఏపీ అంటే హేళనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవహేళన చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల విషయంలో ఏన్డీయే ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని శనివారం ఇక్కడ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రఘువీరారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందుకే తాము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని ప్రధాని మోదీ చెప్పడం దారుణమని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో తిరుపతి బహిరంగ సభలో ఇచ్చిన హామీలను కనీసం ప్రస్తావించకపోవడం దారుణం, దుర్మార్గం అని రఘువీరా నిప్పులు చెరిగారు. లోక్‌సభలోప్రధాని మోదీ అహంకారంతో వ్యవహరించారని ఆయన తీరు గర్హనీయమని అన్నారు. బీజేపీకి 325 ఓట్లు వచ్చాయని, అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి 325 ఓట్లు కూడా రావని పీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పిన విధంగానే వైకాపా నడుచుకుంటోందని ఆయన ఆరోపించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైల్‌పై సంతకం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, మస్తాన్‌వల్లీ తదితరులు పాల్గొన్నారు.