జాతీయ వార్తలు

వచ్చేవారం రివ్యూ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ఎస్సీ/ఎస్టీల వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి కేంద్రం ఉద్యుక్తమవుతోంది. ఈ చట్టం కింద కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకున్నది. బహుశా ఈ రివ్యూ పిటిషన్‌ను వచ్చే బుధవారం దాఖలు చేసే అవకాశముంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టంపై సరికొత్త నిబంధనలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గుర్తించిందన్నారు.
ఎస్సీ/ఎస్టీ వేధింపుల నివారణ చట్టం-1989 కింద క్రిమినల్ కేసు నమోదైన వెంటనే అరెస్టులు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. కాగా ఎన్‌డీఎకు ఎల్‌జెపి అధినేత రాం విలాస్ పాశ్వాన్, కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తారాచంద్ గెహ్లాట్‌ల నేతృత్వంలో ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్యేలు నిన్న రాష్టప్రతి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకొని సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించాల్సిందిగా కోరారు. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని గెహ్లాట్ ఈమధ్యనే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు.