జాతీయ వార్తలు

మీది వెనె్నముకలేని పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 21: నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అన్నాడీఎంకే ఓటు వేయకపోవడాన్ని ఆ పార్టీ బద్ధశతృవు డీఎంకే నిప్పులు చెరిగింది. అన్నాడీఎంకే వెన్నుముకలేని పార్టీగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానం వ్యవహారాంలో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం బట్టబయలైందని ఆయన విమర్శించారు. ఎన్‌డీఏతో తమిళనాడు ప్రభుత్వం అనేక సందర్భాల్లో ‘క్విడ్‌ప్రొకొ’కు పాల్పడిందని స్టాలిన్ ఆరోపించారు. లోక్‌సభలో శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సందర్భంగా అన్నాడీఎంకే అసలు బండారం బయటపడిందని ఆయన విమర్శించారు. ‘నీట్, 15వ ఆర్థిక సంఘం, జీఎస్‌టీ, హిందుత్వ రాజకీయాలు వంటి తీవ్రమైన విషయాల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య క్విడ్‌ప్రొకొ ఉంది’అని డీఎంకే అధినేత విరుచుకుపడ్డారు. ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వడం ద్వారా వెన్నుముకలేని పార్టీగా అన్నాడీఎంకే నిరూపించుకుందని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన వెంటనే స్టాలిన్ ట్వీట్లు చేశారు. అలాగే శనివారం ఉదయం ఓ ప్రకటనలో అధికార పార్టీపై విమర్శలు కురిపించారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడడంతో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని అన్నింటినీ పూర్తిగా విస్మరించారని స్టాలిన్ ఆరోపించారు.
నీట్, జీఎస్‌టీ, యూజీసీ కొనసాగింపు, డ్యామ్ బిల్లుతో తమిళనాడుకు ఎంతో నష్టం జరుగుతుందని గగ్గోలుపెట్టినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. బీజేపీది అప్రజాస్వామ్య పాలన, సామాజిక అంశాలు మోదీ సర్కార్‌కు పట్టవని స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మెప్పుపొందాలన్న తాపత్రయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అన్నాడీఎంకే నేతలకు అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కావేరీ జలాల విషయంలో లోక్‌సభలో తాము చేపట్టిన ఆందోళనకు ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని, కాబట్టి టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేయబోమని సీఎం పళనిస్వామి గురువారమే వెల్లడించారు. శుక్రవారం రాత్రి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగ్గా మోదీ సర్కార్‌కు అనుకూలంగా 325, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి.