జాతీయ వార్తలు

రైల్వే సిబ్బందికి ఎల్‌టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29 : రైల్వే ఉద్యోగులు, లీవ్ ట్రావెల్ కనె్సషన్‌ను(ఎల్‌టిసి) ఉపయోగించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరికి ఇటువంటి సదుపాయం కల్పించడం ఇదే ప్రథమం. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను సిబ్బంది మంత్రిత్వశాఖకు చెందిన పబ్లిక్ గ్రీవెనె్సస్ అండ్ పెన్షన్ డిపార్ట్‌మెంట్ మార్చి 27న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎల్‌టిసి నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు వారి జీవిత భాగస్వాములు ఎల్‌టీసీ సదుపాయం పొందవచ్చు. అయితే రైల్వే ఉద్యోగులకు ‘ఉచిత పాస్’ సదుపాయం ఉన్నందువల్ల, వారికి ఎల్‌టీసీని వర్తింపజేయలేదు. ఆయితే 7వ వేతన సంఘం రైల్వే ఉద్యోగులను కూడా ఎల్‌టీసీ పరిధిలోకి తీసుకొని రావాలని సిఫారసు చేసింది. దీంతో రైల్వే మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే ఉద్యోగులు నాలుగేళ్లలో ఒకసారి ఈ ఎల్‌టీసీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇది వారికి ఐచ్ఛికం మాత్రమేనని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే రైల్వే ఉద్యోగుల (పాస్) నిబంధనలు యథాతథంగా అమలవుతాయి. ఇదే సమయంలో సీసీఎస్(ఎల్‌టిసి) కింద ‘ఆల్ ఇండియా ఎల్‌టీసీ’ను వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఆదేశాలు జారీ అవుతాయి. రైల్వే ఉద్యోగులు ‘హోమ్ టౌన్ ఎల్‌టీసీ’కి అనర్హులు. అంతేకాదు ఎల్‌టీసీ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటున్న సంవత్సరంలో, తమ ‘ప్రివిలేజ్ పాస్’ లను స్వాధీనం చేయాల్సి ఉంటుంది. డ్యూటీపాస్, స్కూల్ పాస్, స్పెషల్ పాస్, చికిత్సకోసం ఇచ్చే స్పెషల్ పాస్‌లు యథావిధిగా కొనసాగుతాయి. రైల్వే పీఎస్‌యూల వంటి ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులకు కూడా ఎల్‌టీసీ సదుపాయం వర్తిస్తుంది.