జాతీయ వార్తలు

జావడేకర్‌ను బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. సీబీఎస్‌ఈ టెన్త్ మేథ్స్, ట్వెల్త్ ఎకనామిక్స్ పేపర్ల లీక్‌కు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జావడేకర్, బోర్డు చైర్‌పర్సన్ అనితాకర్వాల్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీక్షా పేపర్ల లీక్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ‘ఎగ్జామ్ మాఫియా’ హవా నడుస్తోందని, పరీక్ష పేపర్ల లీక్ వెనక దాని పాత్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది భవిష్యత్ నాశమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లీకులమయం అయిపోయిందని ప్రజలకు కాపలాదారు(చౌకీదార్)గా ఉంటాన్న నరేంద్ర మోదీ బలహీనమైపోయారని రాహుల్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చౌకీదార్‌గా ఉండి పాలన అందిస్తానని మోదీ హామీ ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్తుచేశారు. ‘సీబీఎస్‌ఈ పేపర్ల లీక్‌కు జావడేకర్, సంస్థ చైర్‌పర్సన్ అనిత నైతిక బాధ్యత వహించాలి. వారిద్దరూ తప్పుకోవాలి’అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష పేపర్ల లీక్ వల్ల 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడిందని అన్నారు. టెన్త్ మేథ్స్, ట్వెల్త్ ఎకనామిక్స్ పేపర్లు లీకైనట్టు ప్రభుత్వం అంగీకరించం చూస్తే విద్యాశాఖ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుందో అర్థమవుతోందని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఎగ్జామ్ మాఫియా రెచ్చిపోతోందని, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే పనిలో బిజీగా ఉన్న జావడేకర్ విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మేథ్స్, ఎకనామిక్స్ పేపర్లే కాకుండా బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ పేపర్లు లీకై, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా సీబీఎస్‌ఈ పరీక్షా పేపర్ల లీక్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.