జాతీయ వార్తలు

అన్నింటా లీక్.. చౌకీదార్ వీక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీక్‌పై ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ట్విటర్ వేధికగా చేసుకుని మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. ‘మోదీ సర్కార్‌లో లీకులే లీకులు. డేటా లీక్. ఆధార్ లీక్. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ లీక్. ఎలక్షన్ డేట్ లీక్.. ఇప్పుడు సీబీఎసీఈ పేపర్ల లీక్, యాతావాతా చౌకీదార్ వీక్’ అంటూ కాంగ్రెస్ చీఫ్ సెటైర్లు వేశారు. మున్ముందు ఇంకెన్ని లీక్‌లు చూస్తామో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చౌకీదార్ వీక్ వల్లే ప్రతి చోటా లీక్‌లు జరుగుతున్నాయన్న రాహుల్ వీటన్నింటినీ హిందీ,ఇంగ్లిష్‌లో ట్వీట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుందని ఆయన అన్నారు. విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకరంగా మారుతుందని రాహుల్ చెప్పారు. బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టాత్మక సంస్థలను నాశనం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.