జాతీయ వార్తలు

రంగంలోకి దిగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేయాలి.. రాష్ట్ర విభజనపై తాను సుప్రీం కోర్టులో వేసిన కేసు.. పోలవరంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు రాష్ట్ర హైకోర్టులో వేసిన కేసుల్లో ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయించాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీకి వచ్చి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేందుకు కృషి చేయాలన్నారు. అన్నాడీఎంకే సభ్యులు వౌనం వహిస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది.. చర్చ జరిగితే రాష్ట్ర విభజన ఎంత అన్యాయంగా జరిగిందనేది వెలుగులోకి వస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో మెజారిటీ ఉన్నా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానివ్వటం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదంటూ తాను సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టులో వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ ఫైల్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అరుణ్ కుమార్ సూచించారు. నిజం చెప్పటం మీ బాధ్యత.. దీనినుండి తప్పించుకోవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన నిజాలు.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఖర్చుకు సంబందించిన నిజాలను కౌంటర్ ద్వారా కోర్టుకు వివరించాలని అరుణ్‌కుమార్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కొంతకాలం రాజకీయాలు, సంకుచితత్వాన్ని పక్కనబెట్టి రాష్ట్రంకోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు లోక్‌సభలో మెజారిటీ లేకున్నా బిల్లు పాసైనట్లు ప్రకటించారు.. ఇప్పుడు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నా స్పీకర్ మాత్రం అంగీకరించటం లేదని ఆయన ఆరోపించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి ఇష్టం ఉంటే లెక్కపెట్టటం సాధ్యమవుతుంది.. ఇష్టం లేకపోతే లెక్కపెట్టటం సాధ్యం కాదు.. అని అరుణ్‌కుమార్ అన్నారు. ఇక మిగిలింది తొమ్మిది నెలల కాలం మాత్రమే. ఇకనుంచైనా రాష్ట్రంకోసం వెచ్చించాలని ఆయన హితవు చెప్పారు. రాష్ట్రం సర్వనాశనమైపోతోందని చంద్రబాబే చెబుతున్నాడు.. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఏం చేయాలనేది ఆయనే ఆలోచించాలని అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి అందిన సహాయంపై శే్వతపత్రం విడుదల చేయాలని చంద్రబాబును కోరారు. రాష్ట్ర సమస్యను తన స్వంత సమస్యగా భావించి వెంటనే రంగంలోకి దిగాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బీజేపీకి ప్రధాన పాత్ర ఉన్నదన్నారు. బీజేపీతో చెడింది కాబట్టి చంద్రబాబు ఇప్పుడైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పోలవరానికి కేంద్రం నుండి వచ్చిన నిధులపై నిజాలు బైటపెట్టాలని అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
చిత్రం గురువారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న ఉండవల్లి అరుణ్‌కుమార్