జాతీయ వార్తలు

ఐదేళ్లుగా ఎదురుచూశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 29: మానవ హక్కులు, బాలికల విద్యకోసం ప్రచారం చేస్తూ నోబెల్ బహుమతిని అందుకున్న మలాల యూసఫ్‌జాయ్ గురువారం తన మాతృభూమి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఆమె రక్షణకు అక్కడి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. 2012లో తాలిబన్ మిలిటెంట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను చికిత్స నిమిత్తం బ్రిటన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం శ్వాత్ వాలీలో బాలికా విద్య, మానవ హక్కుల కోసం విశేషంగా ప్రచారం నిర్వహించారు. అందుకుగాను ఆమెకు 2014లో నోబెల్ బహుమతి లభించింది. ఇప్పుడు ఆమెకు 20 ఏళ్లు. ‘ఐదేళ్లుగా ఎప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి వస్తానా అని ఎదురు చూస్తున్నాను.. ఇప్పుడు ఆ సంతోష ఘడియను ఆహ్వాదిస్తున్నాను’ అంటూ చమర్చిన కళ్లతో, గద్గత స్వరంతో మలాల తెలిపింది. ‘ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఐదున్నర సంవత్సరాల అనంతరం నా మాతృభూమిపై కాలుమోపాను’ అంటూ భావోద్వేగానికి గురైంది. పాక్ ప్రధాని అబ్బాసీ మలాలాకు స్వాగతం పలుకుతూ- పాకిస్తాన్ పుత్రిక నోబెల్ బహుమతి సాధించడం మనందరకూ గర్వకారణం. ఇప్పుడు ఈమె సాధారణ మహిళ కాదు.. ఈమెకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అన్నారు. తల్లిదండ్రులతో కలిసి బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమాశ్రయంలో దిగినప్పుడు మాలాల పాక్ సాంప్రదాయక దుస్తులైన షెల్వార్ కమీజ్, పరికిణీ ధరించి ఉన్నారు.