జాతీయ వార్తలు

జడ్జీల సమావేశం ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ కలుగజేసుకుంటున్న అంశంపై న్యాయమూర్తులతో సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు మార్చి 21న ఒక లేఖ రాశారు. ‘న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య సన్నిహిత సంబంధాలు ప్రజాస్వామ్యానికి మరణశాససం తప్ప మరోటి కాద’ని జస్టిస్ చలమేశ్వర్ తన లేఖలో హెచ్చరించారు. ఈ లేఖ ప్రతులను సుప్రీంకోర్టుకు చెందిన మరో 22 న్యాయమూర్తులకు కూడా పంపారు. కర్నాటక డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణ్భట్‌కు పదోన్నతికోసం కొల్లేజియం రెండుసార్లు సిఫారసు చేసినప్పటికీ, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేష్ మహేశ్వరి, కృష్ణ్భట్‌పై విచారణ ప్రారంభించడంలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. కేవలం కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నిర్దేశం మేరకే ఈ విచారణ జరుపుతున్నారని ఆరోపించారు. ‘బెంగళూరుకు చెందిన కొందరు తెరవెనుక ఉండి మమ్మల్ని రేస్‌లో అట్టడుగు స్థానానికి నెట్టేశారు. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మా వెనుక కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేస్తున్నార’ని జస్టిస్ చలమేశ్వర్ తాను రాసిన ఆరుపేజీల లేఖలో స్పష్టం చేశారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులమైన మనం, మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, సంస్థ నైతిక నిష్టను పక్కన బెట్టి, కార్యనిర్వాహక వ్యవస్థ చొరబాటుకు అనుమతిస్తున్నామన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాం’ అని పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాన న్యాయమూర్తులను డిపార్ట్‌మెంట్ హెడ్స్‌గా పరిగణించడానికే యత్నిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోలేదని గుర్తుచేశారు. గత జనవరి 12న జస్టిస్ చలమేశ్వర్, మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో అసాధారణ రీతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాన న్యాయమూర్తి కేసుల కేటాయింపుపై ప్రశ్నించారు. కోల్లీజియం చేసిన సిఫారసులను కూడా ప్రభుత్వం తొక్కిపట్టడం దారుణమని పేర్కొన్నారు. ఈ పరిణామంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.