జాతీయ వార్తలు

కావేరీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: సాధ్యమైనంత త్వరగా కావేరీ జలాల నిర్వహణ బోర్డును (సీఎంబీ) ఏర్పాటు చేయాలని, నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ప్రధానిగా మీకు కావేరీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసే అధికారం ఉంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఆ దిశగా చర్యలు తీసుకోండి’ అని ఇక్కడ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య కావేరీ నదీజలాల వివాదంపై గత ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన దగ్గరినుంచి, సీఎంబీ, కావేరీ నీటి నియంత్రణా కమిటీ (సీడబ్ల్యుఆర్‌సి)లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తమిళనాడులో క్రమంగా బలపడుతూ వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తేదీనుంచి ఆరువారాల్లోగా కేంద్రం ప్యానళ్లను ఏర్పాటు చేయాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. మార్చి 29తో ఆరువారాల సమయం ముగుస్తోంది. అధికార ఏఐడీఎంకేతో సహా విపక్ష డీఎంకె, ఇతర రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు సీఎంబీని ఏర్పాటు చేసి కావేరీ నదీజలాల్లో తమిళనాడుకు న్యాయంగా రావలసిన వాటా వచ్చేలా చూడాలని కోరుతున్నాయి. ఇది మాత్రమే అందరికీ ఆమోదయోగ్య పరిష్కారమని అవి పేర్కొంటున్నాయి. అంతకుముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమలాహసన్ కూడా సీఎంబి ఏర్పాటుకు మద్దతుగా ట్వీట్‌లు చేశారు.
‘ఈ సమస్యపై రాజకీయం చేస్తే అది ఓట లకోసం. కానీ ఇది ప్రజల జీవన్మరణ సమస్య. వారికి కావలసింది అమలు చేయండి’ అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ సమస్యపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామితో అప్పాయింట్‌మెంట్ కోరానని ఆయన చెప్పారు. అవసరమైతే తాను ఢిల్లీ వెళ్లి నిరసనలు తెలియజేస్తానని కమల్ హాసన్ తెలిపారు. ట్యుటికోరిన్‌లో ‘స్టెర్‌లైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్’ ఏర్పాటు నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులకు మద్దతు పలకడమే కాకుండా, వారితో కలిసి నిరసనల్లో పాల్గొంటానన్నారు.