జాతీయ వార్తలు

స్టీరింగ్ ఇస్తేనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: తమకు కీలక పాత్ర కల్పించని తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దూరంగా ఉండాలని కాగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడించేందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ లేదా మరో పేరుతో ఏర్పడే ఏ ఫ్రంట్ విషయంలోనైనా ఆచితూచి అడుగేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు స్పష్టం చేసినట్లు సమాచారం. బీజేపీని ఓడించటం కాంగ్రెస్‌తో కూడిన ఫ్రంట్‌కు మాత్రమే సాధ్యమవుతుందని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీని ఓడించాలంటే నాన్ బీజేపీ పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలి, కాంగ్రెస్ నాయకత్వంలో ముందుకు సాగాలి, అప్పుడే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఓడించటం సాధ్యమవుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఎలాంటి ఫ్రంటైనా చివరకు బీజేపీకే లాభదాయకం అవుతుందనేది వాస్తవమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే ఫ్రంట్ ద్వారా బీజేపీని ఓడించటం అసాధ్యమన్నది కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్‌కు సముచిత ప్రాధాన్యత ఇవ్వకుండా ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌కు దూరంగా ఉంటామని పార్టీ సీనియర్ నాయకుడొకరు స్పష్టం చేశారు. సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించాల్సిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో పని చేయాలంటే కాంగ్రెస్ ముఖ్యమన్నది ఆ పార్టీ అభిప్రాయం. తమతో చర్చించకుండా ఫ్రంట్ రాజకీయాలు కొనసాగేపక్షంలో తాము వాటికి దూరంగా ఉండకతప్పదని స్పష్టం చేస్తున్నారు. ఫ్రంట్ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవటం అంటే రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించకపోవటమే అవుతుంది. ఇది తమకు ఎంతమాత్రం సమ్మతం కాదని పార్టీ నేతలు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర లేదా స్థానిక రాజకీయ అవసరాల మేరకు పని చేస్తాయి. జాతీయస్థాయిలో ఇది ఎంతమాత్రం పని చేయదని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పని చేసే ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయిలో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయటం, కొనసాగించటం ఆచరణీయం, ఆమోదయోగ్యం కాదన్నది కాంగ్రెస్ వాదన. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినాయకుడు కే.చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్ల విషయంలో తాము ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని చెబుతున్నారు. ఈ ఫ్రంట్‌ల పయనం ఎటువైపు అనేది స్పష్టమైన తరువాతే దీనికి సంబంధించిన తమ విధానాన్ని రూపొందించుకుంటామని, ఈ విషయంలో తొందర పడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఫ్రంట్ రాజకీయాల కోసం వచ్చే వారం ఢిల్లీకి వస్తున్న విషయం తెలిసిందే. వీరు ఎవరెవరితో చర్చలు జరుపుతారు, ఏ ప్రాతిపదిపకపై ఫ్రంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తారనేది అధ్యయనం చేయాల్సి ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ నాయకులు, సీఎంల ప్రంట్ ప్రతిపాదనలపై స్పష్టత రావలసి ఉందని వారంటున్నారు. ఈ స్పష్టత రానంత వరకు తాము తొందర పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ కొంతకాలం క్రితం జరిపిన రాజకీయ విందుకు పదిహేడు పార్టీల నాయకులు హాజరయ్యారనేది మరిచిపోరాదని వారంటున్నారు.