జాతీయ వార్తలు

25న సీబీఎస్‌ఈ ఎకనామిక్స్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్‌కు సంబంధించి పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. ఇక 10వ తరగతి గణితశాస్త్ర పేపర్‌కు సంబంధించిన పరీక్షను అవసరమైన పక్షంలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్, హర్యానా ప్రాంతాల్లో మాత్రమే జూలై నెలలో నిర్వహిస్తారు. పేపర్ల లీకేజీపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పై ప్రకటనను విడుదల చేసింది. 10వ తరగతి గణితశాస్త్ర పేపర్ లీకేజీపై హెఆర్‌డి మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ, దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించబోమని స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ-నేషనల్ కేపిటల్ ప్రాంతం, హర్యానాల్లో నిర్వహించే విషయాన్ని 15 రోజుల్లో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. లీకేజీకి సంబంధించి ఝార్ఖండ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి గణితశాస్త్రం పేపరు లీకేజీ గురించి, సీబీఎస్‌ఈ ఛైర్‌పర్సన్‌కు అందిని మెయిల్‌కు సంబంధించిన, పూర్తి వివరాలు కావాలని ఢిల్లీ పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. లీక్ సంబంధించి పదిమందిని విచారించిన పోలీసులు, సీబీఎస్‌ఈ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్‌ను గత వారం సంప్రదించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డీజీ నియామకం
సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్‌టీఏ) డీజీని నియమించింది. సీనియర్ బ్యూరోక్రాట్ వినీత్ జోషీ డీజీగా నియమితులయ్యారు. సీబీఎస్‌ఈ, ఏఐసీటీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. జోషీ మణిపూర్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.