జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలతో సుపరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహించటం ద్వారా అభివృద్ధి, సుపరిపాలనకు స్వాగతం పలకాలని బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా లా కమిషన్‌కు సోమవారం రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. లా కమిషన్ జమిలి ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎన్నికలు ఒక నిర్ధిష్ట కాలానికి నిర్ధిష్ట సమయంలో జరగాలన్నది తమ పార్టీ విధానమని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. నిర్ధిష్ట కాలానికి ఎన్నికలు జరిగితే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను ప్రతిభావంతంగా నిర్వహించేందుకు వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు ఒక సిద్ధాంతం కాదని, 1952 నుండి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు విజయవంతంగా జరిగాయనే విషయాన్ని మరిచిపోరాదని అమిత్ షా సూచించారు. 1870 నుండి జమిలి ఎన్నికల వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అయితే కేంద్ర ఎన్నికల సంఘం 1983, లా కమిషన్ 1999లో పార్లమెంటరీ కమిటీ 2015లో జమిలి ఎన్నికలు జరిపించాలనే సిఫారసు చేశాయని తెలిపారు. దేశానికి జమిలి ఎన్నికలు మంచివని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పలుమార్లు సూచించారని ఆయన తమ లేఖలో సూచించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం వలన పరిపాలనా వ్యయం బాగా తగ్గిపోతుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అగిపోయే అభివృద్ధి పథకాలు కూడా సమర్థంగా ముందుకు సాగుతాయని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం చేసే ఖర్చు కూడా బాగా తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. 2009 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2014 లోక్‌సభ ఎన్నికల వ్యయం మూడు రెట్లు పెరిగిందని, జమిలి ఎన్నికల వల్ల ఈ ఖర్చును బాగా తగ్గించవచ్చునని ఆయన తెలిపారు. 2016లో మహారాష్టల్రో లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం వలన సంవత్సరంలోని మొత్తం 365 రోజుల్లో దాదాపు 307 రోజుల్లో ఏదో ఒక సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటం వలన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయని వెల్లడించారు. ఒక సంవత్సరంలో 307 రోజుల్లోనూ ఎన్నికల వ్రవర్తనా నియమావళి అమలులో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అమలవుతాయని ఆయన ప్రశ్నించారు. పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఒకరిని గెలిపిస్తే శాసనసభ ఎన్నికల్లో మరో పార్టీకి పట్టం కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. 1980 సంవత్సరంలో కర్నాటక ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రంలో జనతాదళ్ (ఎస్)కు పట్టం కట్టారని అమిత్ షా తెలిపారు.