జాతీయ వార్తలు

ఆఫ్రికా దేశాల అభివృద్ధిలో మీ కృషి మరువలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: తూర్పు ఆఫ్రికా అభివృద్ధికి కచ్చీ పటేల్ వర్గం ప్రజల పాత్రను ప్రధా ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విదేశాల్లో నివసించే భారతీయులు మన దేశానికి శాశ్వత రా యబారులున్నారు. నైరోబీ, కెన్యాల్లోని ‘శ్రీ కచ్చీ లెవా పటేల్ సమాజ్’ ప్రజల రజతోత్సవాలను పురస్కరించుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆఫ్రికాలో వీరు చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుతించారు. కెన్యా స్వాంతంత్య్రోద్యమంలో భారతీయుల పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారినుద్దేశించి గుజరాతీ భాషలో ప్రసంగించారు. 2001లో భూకంపం సంభవించినప్పుడు పునరావాస కల్పనలో కచ్చీ సమాజం చేసిన సేవలు ఎన్నటికీ గుర్తుంటాయన్నారు. కచ్‌ను ఒకప్పుడు ఎడారి ప్రాంతమని భావించేవాళ్లం. కానీ నేడది అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకున్నదని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ‘గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి కొన్ని వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయని’ ఆయన వెల్లడించారు. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు, ఆఫ్రికన్ అభివృద్ధి బ్యాంకు సమావేశం భారత్‌లో జరిగాయి. మనదేశ రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఆఫ్రికాదేశాల్లో పర్యటించారని చెబుతూ, ప్రధానిగా తాను వివిధ ఆఫ్రికా దేశాలను 20 సందర్భాల్లో సందర్శించానని చెప్పారు.
ఇప్పటి వరకు భారత్‌ను సందర్శించని వారిని ఆయన మనదేశానికి ఆహ్వానించారు. 2019 జనవరిలో జరిగే కుంభమేళాలో పాల్గొని, ఇక్కడి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలను అవగాహన చేసుకోవాలని కోరారు.