జాతీయ వార్తలు

వాజపేయ ఆరోగ్యం విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం విషమించింది. కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయిని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో జూన్ 11న చేర్చించారు. బుధవారం వాజపేయి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ప్రధాన నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. 93 ఏళ్ల వయస్సున్న వాజపేయి 2009 నుంచి తీవ్రమైన అస్వస్తతతో బాధపడుతున్నారు. అప్పటినుంచి ప్రజా జీవితానికి దూరమయ్యారు. శ్వాసకోశ వ్యవస్థ, మూత్రపిండ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మూత్రనాళంలో ఇనె్ఫక్షన్ తలెత్తిందని చెప్పారు. శారీరక సమస్యలతో డెమినెన్షియా వ్యాధి కూడా సోకింది. డయాబెటిస్ వ్యాధి తీవ్రత వల్ల పలు అవయవాలు దెబ్బతిన్నాయి.