జాతీయ వార్తలు

కేరళలో ఆగని వరదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 15: కేరళలో వరదల వల్ల ప్రజా జీవనం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఇంతవరకు 67 మంది మృతి చెందారు. బుధవారం ఒక్క రోజు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 25 మంది మరణించారు. కాగా కేరళలో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొచి విమానాశ్రయాన్ని మూసివేసి విమానం రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకు నిలిపివేశారు. ముళ్లపెరియార్ డ్యాం 13 గేట్లను ఎత్తివేసి వరదనీటిని దిగువకు వదిలారు. రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న వరదల బీభత్సంపై ముఖ్యమంత్రి పి విజయన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే నాలుగురోజులు కూడా భారీ వర్ష సూచన హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మున్నార్‌లో తమిళనాడుకు చెందిన వరదల తాకిడికి మరణించాడు. కాగా మరో ఆరుగురిని పోలీసులు రక్షించారు. ఒక ఇంటిపై మట్టిపెళ్లలు విరిగిపడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఈ ఇంటిలో ఉన్న ఆరేళ్ల పాప ఆచూకీకోసం పోలీసులు గాలిస్తున్నారు ప్రకృతి విపత్తు యాజమాన్య దళం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కేరళలో 14 జిల్లాల్లో అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఇంత వరకు పల్లపుప్రాంతాల్లో ఉన్న 1.5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళలో రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనేక చోట్ల రవాణా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. రోడ్డు కొట్టుకుపోయాయి. విద్యుత్ నిలిచిపోయింది. కమ్యూనికేషన్లవ్యవస్థ దెబ్బతింది. కేంద్రం తక్షణమే ఇంకా ఆర్మీ, నేవీ దళాలను రంగంలోకి దింపి సహాయక చర్యలను చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడం, భారీవర్షాలు తోడుకావడంతో, సహాయక చర్యలు చేపట్టడంలో అటంకాలు ఎదురవుతున్నాయి. ముళ్లపెరియార్ డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం 142 అడుగులు ఉంది. నీటి మట్టం 139 అడుగులు ఉండేటట్లుచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయన్ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. కాగా ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి విజయన్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితి గురించి వాకబు చేశారు.