జాతీయ వార్తలు

ఆర్మీలో మహిళల నియామకానికి పర్మినెంట్ కమిషన్ : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఆర్మీలో తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే నియమితులవుతున్న మహిళా అధికారులకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. ఇతర పురుష ఆర్మీ అధికారుల్లాగే వారిని కూడా పర్మినెంట్ కమిషన్ ద్వారా నియమిస్తామని ఆయన ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో ఆయనఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు ఆర్మీ, నేవీలో మహిళా ఆఫీసర్లను షార్టు సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) ద్వారా నియమిస్తున్నారు. దీనిద్వారా నియమితులైన వారు గరిష్టంగా 14 సంవత్సరాలు మాత్రమే తమ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దీనిపై పలువురు మహిళలు తమకు తమ తోటి పురుష అధికారుల్లాగే తమకూ పర్మినెంట్ కమిషన్ (పిసి) కల్పించాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించారు. అయితే ఇండియన్ ఫోర్సులో ఇప్పటికే మహిళలను ఫైటర్ పైలట్లుగా నియమిస్తున్నారని, అదేవిధంగా ఆర్మీ, నేవీల్లో కూడా నియమించాలని వారు కోర్టును కోరారు. కాగా, ప్రధాని చేసిన ప్రకటన మహిళా ఆర్మీ ఆఫీసర్లకు నిజంగా శుభవార్తే. ప్రధాని తన ప్రసంగంలో పర్మినెంట్ కమిషన్ గురించి వివరాలు అందించకపోయినా, దీనికి సంబంధించిన విధి విధానాలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.