జాతీయ వార్తలు

డోక్లాం పునరావృతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మార్చ్ 31:్భరత, చైనాల మధ్య మరోసారి డోక్లాం పునరావృతం అవుతోందా? భారత, చైనా, భూటాన్ ట్రై జంక్షన్‌లో ఉన్న డోక్లాం పరిసర ప్రాంతాల్లో ఇరుదేశాల సైనిక మొహరింపు మరోసారి పుంజుకోవటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డోక్లాంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామాన్, సైన్యాధ్యయుడు బిపిన్ రావత్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో భారత సైన్యం ట్రై జంక్షన్ ప్రాంతంలో సైనికుల మోహరింపును మరింత పెంచినట్లు సైనికాధికారులు అధికారికంగా వెల్లడించటం గమనార్హం. ఉత్తర డోక్లాంలో దాదాపు రెండు వేల సైనికులను చైనా శాశ్వత ప్రాతిపదికపై మోహరించింది. ఇందుకోసం కోసం చైనా రెండు హెలిపాడ్లను ఏర్పాటు చేయటంతోపాటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు నిర్మించింది, రోడ్ల స్థాయిని బాగా పెంచింది. డోక్లాంను స్వాధీనం చేసుకోవటం ద్వారా సిక్కిం, భూటాన్‌ల మధ్య ఉన్న చుంబి లోయపై తమ పట్టును మరింత పదిలం చేసుకోవాలన్నది చైనా వ్యూహం. దీన్ని అడ్డుకునేందుకే డోక్లాం,దాని చుట్టుపక్కల భూభాగంలో మొహరించిన సైనికుల సంఖ్యను భారత్ ఇటీవల గణనీయంగా పెంచింది. సైనికుల సంఖ్యను పెంచటంతోపాటు నిఘా యంత్రాంగాన్ని కూడా బాగా అధికం చేసినట్లు సైనికాధికారులు చెబుతున్నారు. అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లు, ఇతర నిఘా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నాము, చైనా సైనికుల కదలికలపై ఒక కనే్నసి ఉంచటంతోపాటు వారి చలనాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ చర్యలు తోడ్పడతాయని వారంటున్నారు. టిబెట్, అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పెద్ద ఎత్తున పటిష్టం చేశామని, చైనా సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇవి బాగా తోడ్పడుతున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. దాదాపు 17000 అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండలు, నదుల మలుపుల్లో జరిగే చర్యలపై దృష్టి పెట్టామంటున్నారు. గత సంవత్సర జూన్‌లో 73 రోజుల డోక్లాం సంఘటన అనంతరం చైనా సైనికులు అక్కడ తమ నిర్మాణ కార్యక్రమాలను నిలిపివేయటం తెలిసిందే. భారత, చైనా, భూటాన్ ట్రై జంక్షన్‌లో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారత సైనికులు 73 రోజుల పాటు అడ్డుకోవటం తెలిసిందే. ఒక దశలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటం తెలిసిందే. అయితే చైనా సైన్యం అప్పటి నుండి డోక్లాం చుట్టుపక్కల తమ భూభాగంలో సైనికుల మోహరింపుతోపాటు సైనిక శక్తిని కూడా బాగా పెంచుకున్నది. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని తరలించటంతోపాటు ట్యాకులు, క్షిపణలను డోక్లాం వెనక ఉన్న భూభాగాల్లో మోహరించింది. దీనితో పాటు చైనా తమ భూభాగంలోని రోడ్లను సైనిక స్థాయికి తీసుకు వచ్చింది. పాత రోడ్లను మరమ్మతు చేయటంతోపాటు కొత్త రోడ్ల నిర్మాణం కూడా చేపట్టింది. డోక్లాం లాంటి సంఘటన మరోసారి పునరావృతమైతే భారత దేశంపై చర్య తీసుకోవాలనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని సైనిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకునే భారత సైన్యం తగు చర్యలు చేపట్టిందని సైనికాధికారులు చెబుతున్నారు. మంచు కొండలతోపాటు ప్రమాదకరమైన కొండ ప్రాంతాలపై ఆధిపత్యం ఉండేలా చూసుకునేందుకు భారత సైన్య ఈ మధ్య కాలంలో పలు చర్యలు తీసుకున్నది. దిబాంగ్, దౌదెలియా, లోహిత్ లోయ ప్రాంతంలోని సరిహద్దుల్లో చైనా అధిపత్యాన్ని నిలువరించే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత సైనికాధికారులు చెబుతున్నారు. చైనా సైనికులు అకస్మాత్తుగా ముందుకు చొచ్చుకువచ్చి జెండాలు పాతటం ద్వారా తమ అధిపత్యాన్ని ప్రకటించుకుంటారు. ఇలా జరిగిన ప్రాంతాల నుండి చైనా సైనికులను తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో నెలల తరబడి కష్టపడ వలసి వస్తోంది. ఇలాంటివి జరుగకుండా చూసే లక్ష్యంతోనే దీర్ఘకాలిక పెట్రోలింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని వారంటున్నారు. మామూలుగా అయితే పది లేదా పదిహేను మంది సైనికులు వారం, పది రోజుల పాటు సరిహద్దుల వెంట నడుస్తూ పెట్రోలింగ్ చేసి వస్తారు. అయితే ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఈ పెట్రోలింగ్‌ను నెల రోజుల పాటు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సైనికాధికారులు చెబుతున్నారు. పది లేదా పదిహేను మంది సైనికులు నిరంతరంగా నెల రోజుల పాటు సరిహద్దుల వెంట ప్రయాణం చేస్తూ పరిస్థితులపై నిఘా వేస్తారు. సైనిక బృందాలు నెల రోజుల పాటు సరిహద్దుల వెంట ముందుకు నడుస్తూ మన ప్రాంతీయ అధిపత్యాన్ని కొనసాగించాలంటే వారి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చైనా సరిహద్దుల్లో ఇప్పుడీ విధమైన దీర్ఘ కాలిక సరిహద్దు పెట్రోలింగ్ జరుపుతున్నట్లు వారు వెళ్లడించారు. లోహిత్ లోయను దిబాంగ్ లోయతో కలిపే రోడ్డు నిర్మాణం పూరె్తైతే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికుల కదలికలపై నిఘా పెట్టటం మరింత సులభం అవుతుందని సైనికాధికారులు అంటున్నారు. చైనా ఉత్తర డోక్లాంలో తమ సైనికులను మోహరించటంతోపాటు ఆ ప్రాంతంలోని వౌళిక సదుపాయాలను గణనీయంగా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ తన సైనిక మొహరింపును పటిష్టం చేసుకోకతప్పదని చెబుతున్నారు.