జాతీయ వార్తలు

రాహుల్ ప్రచార భేరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యంత విస్తృత స్థాయిలో ప్రచార యుద్ధా న్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలోని బీజేపీ వరుస విజయాలు, తమ పార్టీ ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాలను కోల్పోతున్న నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు దాదాపు 24 రోజుల పాటు భారీ ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో ముమ్మర ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు మంచి పట్టున్న షిమోగా నుంచే రాహుల్ గాంధీ ఈ ప్రచార భేరీ మోగించనున్నారు. బెంగళూరులో జరిగే అతిపెద్ద ర్యాలీతో రాహుల్ విస్తృత ప్రచార కార్యక్రమం ముగుస్తుంది. దాదాపు కర్నాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ రాహుల్ పర్యటించి రాష్ట్రంలోని తమ ప్రభుత్వం చేసిన సేవలను వివరించడంతో పాటు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే అవకాశం ఉంది. రాహుల్ కోసం మొ త్తం రెండు దశల్లో ఈ ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే రూపకల్పన జరిగింది. మొదటి దశలో జన ఆశీర్వద్ యాత్ర, రెండో దశలో భాగంగా బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహిస్తారని తెలుస్తోంది.