జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఓటమి తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూర్, మార్చి 31: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక అధికార పీఠం నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తొలగించే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మే 12న జరిగే ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ని గద్దె దించాలని ఇప్పటికే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారని అమిత్ షా తెలిపారు. అవినీతి సహా అనేక అంశాల విషయంలో సిద్దరామయ్య పాలనా తీరుపై రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని అమిత్ షా తెలిపారు. మైసూర్, మాండ్యా, రామనగర జిల్లా ల్లో పర్యటిస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మంచి విజయం సాధిస్తుందని, ముఖ్యంగా పాత మై సూరు ప్రాంతంలో గట్టి పట్టును కనబరుస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో బీజేపీ ఒక్క సీటు ను కూడా సంతరించుకోలేకపోయిందని గుర్తుచేసిన ఆయన ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. అవినీతికి, కాంగ్రెస్ పార్టీకి మధ్యనున్న సంబంధం నీటికి- చేప కు ఉన్న బంధంలా మారిందని, ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిసుంటేనే మనుగడ సాగిస్తాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడేందుకు కర్నాటక ప్రభుత్వం కాంగ్రె స్ పార్టీకి ఏటీఎంలా మారిపోయిందని, ముఖ్యంగా సిద్దరామయ్య పాలనలో ఇది మరింత వెర్రితలలు వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీకూడా బలంగా ఉన్నప్పటికీ అది కొన్ని సీట్లను మాత్రమే గెలుచుకోగలుగుతుందని, కాంగ్రెస్ పార్టీని గద్దె దించే సత్తా ఒక్క బీజేపీకి మాత్ర మే ఉందని అమిత్ షా ఉద్ఘాటించా రు. సిద్దరామయ్య ప్రభుత్వంఅన్ని రంగాల్లోనూ విఫలమైందని, రాష్ట్రం లో అనేక చిన్న నగరాల అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఈ ఆత్మహత్యలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చిన్న సంఘటనలుగా పరిగణించ డం విడ్డూరంగా ఉందన్నారు. రైతు ల ఆత్మహత్యలపై ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో ఎ ప్పుడూ చూడలేదని అన్నారు. లిం గాయత్ అంశాన్ని అడ్డం పెట్టుకుని మతపరమైన మైనారిటీ వివాదాన్ని రేకెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర యత్నిస్తోందని ఆరోపించిన అమిత్ షా, ‘లింగాయత్ వర్గానికి చెందిన బలమైన నాయకుడు యెడ్యూరప్ప... ఆయన సారథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాం’’ అని ఉద్ఘాటించారు.

చిత్రం: కర్నాటక ప్రచారంలో భాగంగా మాండ్యా జిల్లాలో ‘ఇంటింటికీ తిరిగి ముష్టి ధాన్య సంగ్రహ అభియాన్’లో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా