జాతీయ వార్తలు

హామీల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల అమలు, విభజన సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం తన వైఖరి చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ సోమవారం సుప్రీకోర్టులో విచారణకు వచ్చింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయం, పోలవరం ముంపుపై అధ్యయనం, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పొంగులేటి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్రాన్ని విడదీసి నాలుగేళ్లు కావస్తున్నా విభజన హామీలు అమలు కాకపోవడం వల్లన రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పిటీషన్ తరపు న్యాయవాది శ్రావణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకోని కేంద్రం తరపున ఎవరు హాజరయ్యారని ప్రశ్నించింది. కేంద్రం తరపు న్యాయవాది హాజరుకాకపోవడంతో కేసు పాస్ ఓవర్ అయింది. తరువాత కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్‌సింగ్ హాజరైయ్యారు. కేంద్రం నుంచి వివరాలు తీసుకోవాల్సి ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం నుంచి వివరాలు అందగానే కోర్టుకి నివేదిస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తరపున అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని న్యాయవాది గుంటూర్ ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హామీల అమలు బాధ్యత కూడా కేంద్రానిదేనన్నారు. నాలుగు వారాల్లోగా ఈ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించడంతో పాటు, సుప్రీం కోర్టు తన విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.