జాతీయ వార్తలు

చైనాను అడ్డుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాశ్వత రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ నాలుగు దేశాలకు చెందిన కొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. జపాన్‌కు చెందిన ససకావా పీస్ ఫౌండేషన్, భారత్‌కు చెందిన వివేకానంద ఇండియా ఫౌండేషన్, ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన ససకావా పీస్ ఫౌండేషన్ సంస్థలు హిందూమహాసముద్రం ప్రాంతం రక్షణకు సంబంధించి సంయుక్తంగా కార్యాచరణ రూపొందించేందుకు 20 మార్గదర్శకాలను విడుదల చేశాయి. భారత్, అమెరికా, జపాన్ దేశాలు కలిసి ఈ కార్యాచరణలో ఆస్ట్రేలియాను భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నించాలని సూచించాయి. హిందూ మహాసముద్రంలోని భూభాగాలపై రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై ఈ దేశాలు అధ్యయనం చేయాలని తెలిపాయి. ఇలాంటి ప్రాంతాల్లో నేవల్ బేస్ ఏర్పాటు చేసి, దీర్ఘశ్రేణి ఆపరేషన్స్ నిర్వహించే వీలుండే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఇండియన్ ఓషనల్ నావల్ సింపోజియమ్, సౌత్ ఏరియా అసోసియేషన్, సార్క్ తదితర సంస్థలతో కలిపి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించాయి. దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్‌లో మనీలాలో జరిగిన సమావేశంలో నాలుగు దేశాల అధినేతలు మొట్టమొదటిసారిగా చర్చించారు. సింగపూర్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగిన సమావేశంలో సీనియర్ అధికారుల మధ్య మరోసారి చర్చలు జరిగిన విషయం తెలిసిందే.