జాతీయ వార్తలు

పవర్ ప్లాంట్లకు వ్యవసాయ వ్యర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: వ్యవసాయ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వినియోగిస్తే 2025 నాటికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 8 శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చునని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్, ఆటోమెటివ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 2025 నాటికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి పలు సూచనలు చేసింది. ఢిల్లీలో వేసవికాలంలో 26 శాతం కాలుష్యం వాహనాలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల ఏర్పడుతోందని, ఇదే కాలుష్యం శీతాకాలంలో 36 శాతానికి చేరుకుంటోందని వారు వెల్లడించారు. అలాగే వ్యవసాయ సీజన్‌లలో పంట పండించిన తర్వాత వాటి వ్యర్థాలను కాల్చడం వల్ల పెద్దయెత్తున కాలుష్యం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యర్థాలను పవర్ ప్లాంట్లకు తరలించి అక్కడ ఉపయోగిస్తే 2025 నాటి కి ఇప్పుడున్న కాలుష్యం కన్నా 8శాతా న్ని తగ్గించచ్చునని తెలిపింది. ప్రతిసంవత్సరం దట్టమైన పొగ, కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ పరిసర ప్రాంతాలను రక్షించడానికి వ్యవసాయ వ్యర్థాలను ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌లకు తరలించి అందులో ఉపయోగించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే సూచించింది. కాగా, ఎల్పీజీ వాడకాన్ని 2025 నాటికి 75 శాతానికి, 2030 నాటికి నూరు శాతానికి పెంచితే కాలుష్య శాతం ఆరు శాతం తగ్గుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. అలాగే చమురు వాడకానికి బదులుగా గ్యాస్‌ను వినియోగిస్తే 12 శాతం కాలుష్యం తగ్గుతుంది. ఈ పరిశోధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాలు, పొలాల్లో వంటకు ఉపయోగించే కట్టెల వల్ల కూడా కాలుష్యం అధికంగా వస్తున్నట్టు గుర్తించింది. ఇలావుండగా అక్టోబర్ మాసంలో పంట వ్యర్థాలను అధికంగా మండిస్తారు.